ఎందరో గొప్ప నటులు వున్న తెలుగు సినీ పరిశ్రమలో కోట శ్రీనివాసరావు కూడా ఒక గొప్ప యాక్టర్. కెరియర్ ప్రారంభం లో ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి, పెద్దగా గుర్తింపు కూడా రాలేదు. అయిన తన ప్రతిభను నమ్ముకున్న నటుడు కోట, ఎప్పుడూ వెనుతిరగలేదు సినీ చరిత్రలో తనకంటూ మంచి గుర్తింపు లభిస్తుందని లభించాలని పట్టుదలతో ముందుకు సాగి అనుకున్నది సాధించి ప్రేక్షకుల మన్ననలను పొందిన మహా నటుడు. ఎన్నో చిత్రాలలో వివిధ పాత్రల్లో నటించి నవరసాలను పండించి ఆడియన్స్ తో భళా అనిపించుకున్నారు. అయితే ఈయన జీవితంలో ఎన్నో కష్టాలను, భరించలేని దుఃఖాలను చవిచూశారు.

ఆయన జీవితంలో జరిగిన కొన్ని విచార ఘటనలు తెలిస్తే మీ కంట కన్నీరు ఆగదు. 1968 లో ఈయనకు రుక్మిణి అనే ఆమెతో వివాహమయింది. ఈయనకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు. ఓ సారి బెజవాడలో సరదాగా కోట శ్రీనివాస రావు కుమార్తె అలాగే కొందరు బంధువులు సరదాగా రిక్షా ఎక్కారట  అయితే ఊహించని ఒక సంఘటన ఆ ఆనంద సమయాన్ని ఒక దుఃఖ సంద్రంలో ముంచేసింది. ఎదురుగా వస్తున్న లారీ వీరు ప్రయాణిస్తున్న రిక్షా  ను ఢీకొట్టడంతో ఆ యాక్సిడెంట్ లో కోట శ్రీనివాసరావు గారి కుమార్తె కాలు పోయిందట. దాంతో అమే భవిష్యత్తు ఏమిటా అంటూ కుటుంబ సభ్యులంతా బాధపడుతున్న సమయంలో, ఒకప్పుడు కోట పనిచేసిన బ్యాంకులో ఎవరి దగ్గర అయితే బ్యాంకులో గుమస్తాగా ఉన్నదో వారింటికే ఆయన కూతురు కోడలిగా వెళ్ళింది.

అలా ఆమె జీవితం ఒక మంచి  కుటుంబంలో సాగుతూ ఉంది. ఇప్పుడు ఆమెకు ఒక కూతురు కూడా ఉంది, వాళ్లు సంతోషంగా ఉన్నారు అంటూ ఆనందంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు కోట.  అలా ఒకప్పుడు ఆయన గుమస్తా గా పనిచేసిన ఆయనకే వియ్యంకుడుగా మారారు కోట. అలాగే తన కొడుకుని కూడా పోగొట్టుకున్నాను అని భగవంతుడు నాకు ఎంత పేరు ఇచ్చాడు అంతే కష్టాలను కూడా ఇచ్చాడు అంటూ చెప్పుకొచ్చారు కోట.


మరింత సమాచారం తెలుసుకోండి: