తన మరణంతో యావత్ దేశాన్ని విషాదంలో ముంచిన పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ లాస్ట్ పిక్ వైరల్ అవుతోంది. అందులో ఆయన గార్డెన్ లో వాకింగ్ చేస్తూ తన కుడి చేతిన ఛాతిపై పెట్టుకున్నట్టు ఉంది. అంటే అప్పుడే ఆయనకు నెమ్మదిగా చెస్ట్ పెయిన్ స్టార్ట్ అయిందేమోనని అభిమానులు చర్చించుకుంటున్నారు. దీంతో ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే నిన్న ఉదయం జిమ్ వర్కవుట్స్ చేస్తుండగా గుండెపోటుతో పునీత్ మృతి చెందాడు.

కార్డియాక్ అరెస్ట్ అంటే.. గుండె కొట్టుకోవడం అకస్మాత్తుగా ఆగిపోవడం. దీని వల్ల శరీరంలో రక్త ప్రసరణ నిలిచిపోతుంది. సాధారణంగా మనం దీన్నే గుండెపోటు అంటాం. అయితే గుండెపోటుకు గురైన వ్యక్తిని ఆస్పత్రికి తరలించే లోపు కార్డియోపల్మోనరీ రీసెసిటీషన్ చేయాలి. ఛాతిపై రెండు చేతులూ పెట్టి నొక్కాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను ప్రతీ ఒక్కరూ నేర్చూకోవాల్సిన అవసరం ఉంది. అత్యవసర సమయాల్లో సీపీఆర్ చేసి మనం ఇతరులను బతికించవచ్చు.

ప్రస్తుత ఆహార అలవాట్లు, ఇతరత్రా కారణాల వల్ల చిన్న వయసులోనూ గుండెపోటు బారినపడుతున్నారు. తాజాగా పునీత్ మరణం అలాంటిదే. అయితే గుండెపోటు లక్షణాలు ఒకసారి పరిశీలిస్తే... చెస్ట్ పెయిన్ రావడం, గుండెలో గుచ్చినట్టు అనిపించడం, ఎడమచేయి పైకి లేపినప్పుడు నొప్పిగా ఉండటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపించడం, ఉక్కపోత లేకపోయినా చెమటలు పట్టడం లాంటి ఉంటాయి. అయితే అందరిలో ఈ లక్షణాలు ఒకేలా ఉండకపోవచ్చు.


మొత్తానికి పునీత్ రాజ్ కుమార్ వాకింగ్ చేస్తున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఫోటోను చూసుకొని అభిమానులు కంటతడిపెడుతున్నారు. తమ అభిమాన హీరో ఇంత ఇబ్బంది పడ్డాడా అని ఆవేదన చెందుతున్నారు. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకొని.. వైద్యులను సంప్రదించి ఉంటే బాగుండేదని అనుకుంటున్నారు. ఎవరికైనా ఛాతిలో నొప్పి అనిపిస్తే.. వైద్యులను ఖచ్చితంగా సంప్రదించండి అంటూ సూచిస్తున్నారు.



 

మరింత సమాచారం తెలుసుకోండి: