ఆర్యన్ ఖాన్ డ్రగ్స్‌ కేసులో జైలుకెళ్లినప్పటి నుంచి నెటిజన్లు షారుఖ్‌ ఖాన్‌ని నేరస్థుడిలా చూస్తున్నారు. పిల్లలని సరిగా పెంచలేకపోయాడని, అవసరానికి మించి డబ్బులు ఇచ్చి కొడుకుని పాడు చేశాడని ట్రోల్‌ చేస్తున్నారు. అయితే ఇప్పుడీ విమర్శలు మరింత పెరిగాయి. ఇండస్ట్రీ నుంచి షారుక్‌ని బాయ్‌కాట్‌ చేయాలని చెప్పేంత వరకు వచ్చేసింది. షారుఖ్‌ ఖాన్‌ రీసెంట్‌గా ఒక చాక్లెట్‌ యాడ్‌లో నటించాడు. దీపావళి పండగకి లోకల్‌ వెండర్స్‌ దగ్గరి నుంచే బట్టలు, యాక్సెసరీస్‌ కొనాలని చెబుతూ జనరల్‌ స్టోర్స్‌లో కూడా దొరికే ఈ చాక్లెట్‌తో నోరు తీపి చేసుకోండని చెప్పాడు. ఇక ఈ యాడ్‌ బయటకి రావడం ఆలస్యం షారుక్‌ ప్రమోట్‌ చేస్తోన్న చాక్లెట్‌ కంపెనీని బాయ్‌కాట్ చేయాలని హడావిడి చేస్తున్నారు నెటిజన్లు.

షారుక్ ఖాన్‌ కొడుకు డ్రగ్స్‌ కేసులో అరెస్ట్ అయ్యాడు. ఇలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్న హీరో సినిమాలని కూడా చూడొద్దంటూ  కామెంట్స్‌ చేస్తున్నారు. దీంతో షారుక్ ఖాన్‌ కెరీర్‌పై నెగటివ్‌ ప్రభావం పడుతుందనీ, కొన్నాళ్లపాటు బాద్‌షా సినిమాలకి సరైన బిజినెస్‌ జరగడం కూడా కష్టమనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. షారుక్ ఖాన్‌ ఈ ఏడాది ఆర్యన్‌ ఖాన్‌ని హీరోగా లాంచ్‌ చేస్తాడనే ప్రచారం జరిగింది. షారుక్ ఫీచర్స్‌తో ఉన్న ఆర్యన్‌ ఖాన్‌తో లవ్‌స్టోరీస్‌ తీసేందుకు కరణ్‌ జోహార్‌ లాంటి దర్శకనిర్మాతలు కథలు కూడా సిద్ధం చేస్తున్నారు. ఇలాంటి సమయంలోనే డ్రగ్స్‌ కేసుతో ఆర్యన్‌ అరెస్ట్ అయ్యాడు. సోషల్‌ మీడియాలో ఆర్యన్‌ని తెగ ట్రోల్‌ చేస్తున్నారు నెటిజన్లు. దీంతో ఆర్యన్ ఖాన్‌ సినిమా కెరీర్‌పై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.

షారుక్ ఖాన్‌ కెరీర్‌ కూడా ఇబ్బందుల్లోనే ఉంది. 'చెన్నై ఎక్స్‌ప్రెస్' తర్వాత షారుక్‌కి సరైన హిట్‌లేదు. ఎనిమిదేళ్లుగా వీడని ఫ్లాపులతో డేంజర్‌ జోన్‌కి దగ్గరయ్యాడు. ఇక 'జీరో' సినిమా అయితే షారుక్‌ని మరింత గట్టి దెబ్బకొట్టింది. షారుక్‌ సొంత బ్యానర్‌లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ దగ్గర డిజాస్టర్‌ అయ్యింది. దీంతో మరో సినిమా చేసేందుకు రెండేళ్లకి పైగా గ్యాప్ తీసుకున్నాడు షారుఖ్.





మరింత సమాచారం తెలుసుకోండి: