మీడియం రేంజ్ హీరోలలో నాని స్థానం చాల ప్రత్యేకమైంది. ఒకప్పుడు మినిమం గ్యారెంటీ హీరోగా నాని సినిమాలకు మంచి కలక్షన్స్ వస్తూ ఉండేవి. దీనితో అతని మార్కెట్ విపరీతంగా పెరిగింది. వాస్తవానికి ఈమధ్య నానీకి వరస ఫ్లాప్ లు రావడంతో అతడి మార్కెట్ కొంతవరకు గందరగోళంలో ఉంది.


ఇలాంటి పరిస్థితులలో అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య నాని స్థానం పై కన్ను పడిందా అన్న సందేహాలు కొందరికి కల్గుతున్నాయి. దీనికి కారణం ఈమధ్య జరిగిన నాగచైతన్య పుట్టినరోజునాడు విడుదలైన అతడి సినిమాలకు సంబంధించిన రెండు డిఫరెంట్ లుక్స్ ను చూసినవారికి ఈ సందేహాలు వస్తున్నాయి.


చైతన్య పుట్టినరోజునాడు ఒకేసారి అతడి రెండు సినిమాలకు సంబంధించిన రెండు డిఫరెంట్ లుక్స్ ను విడుదల చేసారు. అందులో ఒకటి ‘బంగార్రాజు’ అయితే మరొకటి  ‘థాంక్యూ’ మూవీ. ‘బంగార్రాజు’ లో పక్కా మాస్ లుక్ తో ‘థ్యాంక్యూ’ మూవీలో పక్కా క్లాస్ లుక్ లో చైతన్య కనిపిస్తున్నాడు.‘బంగార్రాజు’ మూవీకి సంబంధించి పూల చొక్కా కళ్లజోడు చేతికి బ్రాస్ లెట్ అరచేతిలో కర్ర బుల్లెట్ ఇలా మాస్ లుక్ లో చైతన్యను చూపెడుతూ ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాలోని నాగార్జున మాస్ లుక్ కు జిరాక్స్ కాపీగా దించారు. ఇక ‘థాంక్యూ’ సినిమాకు వస్తే పూర్తిగా క్లాస్ లుక్ లో చైతన్యను చూపెట్టారు. క‌ళ్ల‌ద్దాలు పెట్టుకుని కాస్త గ‌డ్డంతో ఉన్న నాగ‌చైత‌న్య తిరనాళ్ల‌లోని తిరిగే రంగుల రాట్నంలోని గుర్రం పై ఎక్కి కూర్చుని తిరుగుతూ సంతోషంగా క్లాసి లుక్ తో కనిపించాడు. దీనితో చైతన్య అటు క్లాస్ ఇటు మాస్ సినిమాలు చేస్తూ మిడిల్ రేంజ్ హీరోలలో టాప్ స్థానాన్ని పొందడానికి పక్కా వ్యూహాలతో అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. వరసపెట్టి సినిమాలు చేస్తూ డాన్సింగ్ స్కిల్స్ కూడ మెరుగు పరుచుకుంటున్న నాగచైతన్య మిడిల్ రేంజ్ హీరోలలో గట్టి పోటీ ఇచ్చి తన స్థానాన్ని నిలబెట్టుకునేలా కనిపిస్తున్నాడు..


మరింత సమాచారం తెలుసుకోండి: