ఇటీవలి కాలంలో సినిమా హీరోయిన్లు సర్జరీలు చేయించుకోవడం అనేది సర్వసాధారణంగా మారిపోయింది అని చెప్పాలి. ఎంతోమంది సినిమా హీరోయిన్లు మరింత అందంగా కనిపించడానికి శరీరంలోని కొన్ని భాగాలకు సర్జరీ చేయించుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు.. సర్జరీల ద్వారా అందానికి మెరుగులు దిద్దుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. హీరోలలో కొంతమంది మాత్రమే ఇలాంటి సర్జరీలు చేసుకుంటే అటు హీరోయిన్లలో మాత్రం చాలా మందే సర్జరీల వైపు మొగ్గు చూపుతుంటారు.. అయితే ఇలా సర్జరీలు చేసుకున్న సమయంలో కొన్ని కొన్ని సార్లు హీరోయిన్లకు చేదు అనుభవాలు ఎదురవ్వడం లాంటివి కూడా జరుగుతూ ఉంటుంది.


 అందం పెంచుకోవడం కోసం చేసుకునే సర్జరీల ద్వారా చివరికి అందం వికటించి దారుణం గా మారిపోతూ ఉంటారు కొంత మంది సెలబ్రిటీలు. ఇక ఇలా ఇప్పటికే ఆయేషా టాకియా అనే సినీ సెలబ్రిటీల విషయంలో కూడా జరిగింది. ఇటీవలికాలంలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా  సర్జరీ చేసుకుని దారుణంగా మారిపోయింది అంటూ ఆ మధ్య కాలంలో ఎన్నో ట్రోల్స్ కూడా వచ్చాయి. ఇక ఇప్పుడు బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటాని గురించి కూడా ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయ్. ఎప్పటి లాగా కాకుండా కాస్త డిఫరెంట్ గా కనిపించింది ఈ అమ్మడు. ఈ అమ్మడికి సంబంధించిన ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయ్. ఇటీవలే సల్మాన్ ఖాన్ నటించిన అంతిమ్ స్పెషల్ స్క్రీనింగ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి దిశాపటాని కూడా వచ్చింది. అయితే ఇక్కడికి ఎల్లో డ్రెస్ లో వచ్చిన దిశా పటాని లుక్ లో ఏదో తేడాని గమనించారు నెటిజన్లు. ఈ క్రమంలోనే దిశా పటాని కి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కామెంట్లు కూడా పెడుతున్నారు. దిశా పటాని లుక్ లో  ఏదో తేడా కొడుతుంది అనీ ముక్కు పెదాలకు సర్జరీ చేయించుకున్నట్లు అనిపిస్తుంది అంటూ కొంతమంది నటులు కామెంట్లు పెడుతున్నారు. ఇలా అందంగా ఉన్న దిశా కానీ సర్జరీతో చివరికి ముఖం పాడు చేసుకుంది అంటూ మరికొంతమంది కామెంట్లు పెడుతున్నారు  మరి నిజంగానే దిశా పటాని సర్జరీ చేసుకుందా  లేదా అని తెలియాలంటే మాత్రం నేరుగా ఈ అమ్మడు స్పందించాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: