ఎన్నో అంచనాలతో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది బోయపాటి బాలయ్యల కాంబోలో తెరకెక్కిన 'అఖండ' మూవీ. నిన్నటి వరకు టాలీవుడ్ లో ఇది ఒక ట్రెండింగ్ న్యూస్ గా ఉంది. ఈ సినిమా వీరి కలయికలో హ్యాట్రిక్ హిట్ అని సినిమా యూనిట్ అంతా భావించారు. అందుకు తగ్గట్టే సినిమా ఆద్యంతం బాలయ్య బోయపాటిమాస్ సీన్ లతో కళకళలాడింది. కానీ ఏదో మిస్ అయిన ఫీలింగ్ సగటు ప్రేక్షకుడు కు కలిగి ఉంటుంది. ఎందుకంటే గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో అనవసరమైన సీన్ లను ఇరికించి బోయపాటి అతికి పోయాడు అని విమర్శలు వస్తున్నాయి. బాలయ్యను వాడుకున్నంతగా కథ మీద శ్రద్ధ పెట్టలేదు.

రొటీన్ కథకు అఖండ అనే మసాలాను యాడ్ చేశాడు. అంతే తప్ప విభిన్నమా తెరకెక్కించడంలో సక్సెస్ కాలేదు. ఇంకా ఇంతకు ముందు బోయపాటి సినిమాలలో లేని హింస ఇందులో ఉండడంతో అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంజాయ్ చేయలేరు. ఈ తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ఇంతకు ముందు వచ్చిన సింహ, లెజెండ్ లలో హింస ఉంది కానీ డీసెంట్ గా ఉంటుంది. కానీ ఇక్కడ అదే లోపించింది. ప్రశాంతంగా థియేటర్ కి వెళ్లిన ప్రేక్షకుడు తల బొప్పి కట్టి బయటకు వస్తున్నాడు. సెకండ్ హాఫ్ మొత్తం ఫైటింగ్ లతో విరక్తి పుట్టించాడు. ఫ్యాన్స్ కి అయితే హ్యాపీ కానీ సగటు ప్రేక్షకుడు ఎంజోత్ చేయడం కష్టమే.

ఇప్పటికే సోషల్ మీడియాలో బోయపాటి పై ట్రోలింగ్ స్టార్ట్ అయింది. బయటకు వచ్చిన ప్రేక్షకులు అయితే బాబోయ్...ఇక దండం ఇక మీ కాంబినేషన్ లు ఆపండి అంటూ వేడుకుంటున్నారు. కానీ బాలయ్య యాక్షన్ కు బ్రహ్మరధం పడుతున్నారు. మరి బోయపాటి తన తర్వాత సినిమాలకు అయినా ఈ వైలెన్స్ ను తగ్గించుకుంటాడా అన్నది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: