బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో అఖండ సినిమా భారీ అంచనాల మధ్య తెరకెక్కింది. ఈ సినిమాలో బాలయ్య సరసన నటించింది ప్రగ్యా జైస్వాల్. ఇక ఈ సినిమాపై అంతకంతకు అంచనాలు పెరిగిపోయాయి. ఎందుకంటే ఇప్పటికే బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు  సూపర్ డూపర్ హిట్ సాధించడంతో వీరి కాంబినేషన్ అంటే చాలు ప్రేక్షకులలో  పూనకాలు వచ్చేస్తాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతే కాదు ఫుల్ మాస్ ఎంటర్టైన్మెంట్ సినిమా వీరి కాంబినేషన్ లో వస్తూ ఉంటుంది.


 వీరి కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సారి తెరకెక్కిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ మాస్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమా కేవలం కొన్ని వర్గాల ప్రేక్షకులకు మాత్రమే అలరిస్తుంది అన్నది అర్థమవుతుంది. ఇక ఈ సినిమాలో రెండు గెటప్స్ లో కనిపిస్తూ ఉంటాడు నందమూరి బాలకృష్ణ. అయితే ఈ సినిమా స్టోరీ విషయం పక్కన పెడితే ఈ సినిమాలోని మ్యూజిక్ మాత్రమే అందరిని భయపెడుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సాధారణంగా స్టార్ హీరో సినిమాలు విడుదలైన సమయంలో థియేటర్లలో ప్రేక్షకులకు అసలు సిసలైన మూవీ మజా అందించేందుకు భారీగా సౌండ్ విడుదల చేయడం చేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు బాలయ్య అఖండ సినిమాకు కూడా అలాగే చేస్తున్నారు. కానీ గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు మాత్రం అఖండ సినిమా చూడటం విషయంలో కాస్త జాగ్రత్తపడితే మంచిదట. ఎందుకంటే ఇక ఈ సినిమాను థియేటర్లో చూసీ గుండె సంబంధిత పేషెంట్లకు ఇక ఈ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ భయంకరం గా ఉండటంతో  ప్రమాదం అంటున్నారు ప్రేక్షకులు.  తమన్ కావలసిన దానికంటే అతిగా ఈ సినిమాకు సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని కంపోజ్ చేశాడు అని ప్రేక్షకులు భావిస్తున్నారట.
 ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ లో వస్తున్న సమయంలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే మరీ ఎక్కువ శబ్దం చేసే విధంగా ఉందని ఎంతో డిస్ట్రబెన్స్ గా ఉంటుంది అని ఎంతో మంది ప్రేక్షకులు చెబుతున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఇక అఖండ సినిమా లో ఉన్న పెద్దపెద్ద శబ్దాలతో కూడిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కి భయపడిపోతున్నారట. అందుకే గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు అఖండ సినిమాకి వెళ్ళాలి అంటే జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అని అంటున్నారు కొంతమంది విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: