బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అమితాబ్ బచ్చన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తన సినీ జీవితంలో 180 సినిమాలకు పైగా నటించారు. ఆయనకు రతదేశ సినీ ఇండస్ట్రీలో బిగ్ బీగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అంతేకాదు.. అమితాబ్ బచ్చన్ జాతీయ అవార్డులతో పాటు అంతర్జాతీయ అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. తన సినీ జీవితంలో 15 ఫిలింఫేర్ అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. ఇక ఆయన ఉత్తమ నటుడిగా 40 సార్లు నామినేట్ కాగా, కేంద్రం నుంచి అమితాబ్ కు పద్మ శ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ వంటి గౌరవ పురస్కారాలు కూడా అందుకున్నారు. బుల్లితెరపై 70 సంవత్సరాల వయసులో కూడా కౌన్ బనేగా కరోడ్ పతి షోతో రికార్డు సృష్టించారు.

బుల్లితెరపై అమితాబ్ బచ్చన్ 2000వ సంవత్సరంలో కౌన్ బనేగా కరోడ్ పతి షో నిర్వాహకులు తనను అప్రోచ్ అయ్యారని, ఇక ఆ సమయంలో తన దగ్గర డబ్బులు కూడా లేవు అని ఆయన తెలిపారు. ఇక అదే సమయంలో కౌన్ బనేగా కరోడ్పతి షో ఆఫర్ వచ్చిన సమయంలో డబ్బులు లేక ఏం చేయాలో తెలియక దీనస్థితిలో ఉన్నారని ఆయన స్టేజీపైనే కన్నీటి పర్యంతమయ్యారని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. అంతేకాదు.. ఆఫర్ వచ్చిన సమయంలో తన చేతిలో డబ్బులు లేవని, అవకాశాలు కూడా లేవని ఎంతో ఇబ్బంది పడుతూ చాలా దీనస్థితిలో జీవితాన్ని గడుపుతున్నానని ఆయన వెల్లడించారు.

చిత్ర పరిశ్రమలో సినిమాలో నటించి అంత స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న తర్వాత కూడా అవకాశాలు లేక మళ్లీ బుల్లి తెరపై కనిపిస్తే ఎగతాళి చేస్తారేమో అన్న ఆలోచనతో భయపడి మొదటిసారి ఆఫర్‌ను రిజెక్ట్ చేసినట్లు వెల్లడించారు. అయితే అతను మనోధైర్యంతో షో చేయాలని నిర్ణయించుకుని, ఒక ఎపిసోడ్‌తో మొదలు పెట్టిన ఈ షో ఇప్పుడు వెయ్యి ఎపిసోడ్లు పూర్తి చేసుకుని రికార్డ్ సృష్టించిందని ఆయన పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆయనకీ  కౌన్ బనేగా కరోడ్‌పతి షో కాపాడిందని చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: