మరోవైపు పవన్ కళ్యాణ్ మళయాళీ హిట్ 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్ చేస్తున్నాడు అనగానే ఒరిజినల్ సోల్‌ని ఎలా క్యారీ చేస్తారని చాలామందికి డౌట్స్ వచ్చాయి. అయితే 'భీమ్లానాయక్' టీమ్ మాత్రం 'ఎకె' రూట్‌లోనే వెళ్తోంది. 'భీమ్లానాయక్' టీజర్‌లోనే మళయాళీ మ్యూజిక్ డైరెక్టర్‌ని వినిపించాడు తమన్. అలాగే ఇప్పుడు సాంగ్స్‌లోనే అయ్యప్పన్‌నే ఫాలో అవుతున్నాడు భీమ్లానాయక్. 'అయ్యప్పనుమ్ కోషియుమ్' సినిమాతో గ్రామీణ మహిళ నంజమ్మని ప్లేబ్యాక్ సింగర్‌గా మార్చాడు సంగీత దర్శకుడు జేక్స్ బిజాయ్. ఇక ఈ మూవీ రీమేక్‌గా వస్తోన్న 'భీమ్లానాయక్'తో ఇద్దరు జానపద గాయకులని ప్లేబ్యాక్ సింగర్స్‌గా మార్చాడు.
'భీమ్లానాయక్' టైటిల్ సాంగ్‌లో కొంత భాగాన్ని కిన్నెర మొగిలయ్యతో పాడించాడు. ఈ సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. ఇక ఇప్పుడు అడవితల్లి పాటని గ్రామీణ మహిళ దుర్గవ్వతో పాడించాడు తమన్. తమన్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఆల్బమ్ 'అల వైకుంఠపురములో'. తమన్‌ని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లిన ఈ ఆల్బమ్‌తో ఒక జానపద గాయకుడిని ప్లేబ్యాక్ సింగర్‌గా మారాడు. ఉత్తరాంధ్ర గాయకుడు సూరన్నతో సిత్తరాల సిరపడు పాట పాడించాడు తమన్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి