తెలుగు చిత్ర పరిశ్రమలో మోస్ట్ డబుల్ కపుల్స్ గా కొనసాగిన నాగ చైతన్య సమంత ఒక్క సారిగా ఎవరూ ఊహించని విధంగా విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి షాకిచ్చారు. అయితే ఇప్పటికీ కొంతమంది అభిమానులు వీరి విడాకుల అంశాన్ని నమ్మలేకపోతున్నారు అని చెప్పాలి. ఒకరిపై ఒకరు అమితమైన ప్రేమ అభిమానాన్ని చూపించే ఇద్దరు విడిపోవడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు.. ఇక వీరిద్దరు విడిపోవడానికి గల కారణం ఏంటి అన్నది మాత్రం తెలుగు ప్రేక్షకులకు ఒక చిక్కు వీడని ప్రశ్నలా గా మారిపోయింది.


 అయితే ఇటీవలే విడాకులు తీసుకుంటున్నాము అంటూ ప్రకటించిన తర్వాత ఎవరి కెరీర్లో వారు బిజీ బిజీగా గడుపుతున్నారు. ఓ వైపు సమంత వరుసగా సినిమాలు చేస్తూ దూసుకు పోతుంది మరోవైపు నాగ చైతన్య కూడా వరుస సినిమాలతో బిజీ గానే ఉన్నారు. అయితే భార్య భర్తలు గా ఉన్నప్పుడు ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్న ఈ జంట మళ్లీకలిస్తే ఎంత బాగుండు అని తెలుగు ప్రేక్షకులు అందరూ కోరుకుంటున్నారు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవలే నాగచైతన్య సమంతా కలుసుకున్నారు.



 అయితే ఇది నిజ జీవితం లో కాదులేండి కేవలం ఒక సినిమా షూటింగ్ నిమిత్తం ఇద్దరు ఒకే చోటకు చేరడం గమనార్హం. రామా నాయుడు స్టూడియో లో ఒకేసారి ఇక సమంత నాగ చైతన్య కనిపించడం తో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. నాగ చైతన్య నటించిన బంగార్రాజు సినిమా రామా నాయుడు స్టూడియో లో షూటింగ్ జరుగుతోంది. అదే సమయం లో సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న యశోద సినిమా షూటింగ్ కూడా రామా నాయుడు స్టూడియో లోనే జరుగుతూ ఉండటం గమనార్హం.. ఇక ఇద్దరూ రామా నాయుడు స్టూడియో లో పక్కపక్కనే కనిపించారు. దీంతో అభిమానులు అందరూ ఎంతగానో మురిసి పోయారు.  కాగా యశోద సినిమా లో సమంత ఒక రిపోర్టర్ పాత్రలో నటిస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: