అయితే ఇప్పటికే షూటింగ్ పూర్తయి విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా వైరస్ కారణంగా షూటింగ్ వాయిదా పడుతూ రావడంతో విడుదల కూడా ఆలస్యం అవుతూ వస్తోంది. ఇక మరికొన్ని రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అనుకుంటున్న సమయంలో రౌడీ హీరో అభిమానులందరికీ ఊహించని షాక్ తగిలింది. విజయ్ దేవరకొండ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ లైగర్ షూటింగ్ కి బ్రేక్ లు పడ్డాయి అన్నది తెలుస్తుంది. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది.
ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో లైగర్ చిత్రబృందం ఈ నిర్ణయం తీసుకున్నారట. ఇప్పటికే ప్రతిరోజు భారీగా కేసులు నమోదవుతున్నాయి. దానికి తోడుగా ఎంతో మంది సినీ ప్రముఖులు సైతం వైరస్ బారిన పడుతున్నారు. దీంతో సినిమా షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ రిస్క్ ఎందుకు అనే ఆలోచనతో షూటింగ్ ను నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఇక ఇకపోతే ఇటీవల అమెరికా వెళ్లి వచ్చిన చిత్ర బృందం లైగర్ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసింది అని అందరూ అభిమానులు సంతోష పడి పోయారు. కానీ ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు ఇంకా చిత్రీకరించాల్సి ఉందట. వాటిని త్వరలోనే పూర్తి చేయాలని చిత్ర బృందం భావిస్తున్నారట.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి