పుష్ప సినిమా చూసిన మంచు లక్ష్మి.. సినిమా అదిరిపోయింది అల్లుఅర్జున్ యాక్టింగ్ ఓ రేంజ్ లో ఉందంటూ కామెంట్లు చేయడం జరిగింది. పుష్ప రాజ్ వంటి పాత్రలు చేయడం చాలా కష్టమని.. ఒక స్టార్ హీరో హోదా కలిగిన వ్యక్తి ఇలాంటి పాత్రలు చేసి మెప్పించడం అనేది చాలా కష్టమని మంచులక్ష్మి తెలియజేయడం జరిగింది. ఇక ఈ సినిమాలో సమంత డాన్స్, రష్మిక నటనతో ప్రేక్షకులను బాగా కట్టిపడేశాయి అని చెప్పుకొచ్చింది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ పరంగా మైండ్ బ్లాక్ చేశారు అని చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం పుష్ప-2 కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు అంటూ మంచులక్ష్మి స్పందించింది. అంతేకాకుండా ఇక అల్లుఅర్జున్ స్పందిస్తూ థ్యాంక్స్ చెప్పడం కూడా జరిగిందట.. ప్రస్తుతం ఈ ట్వీట్స్ కాస్త సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాని తమిళ డైరెక్టర్ సెల్వరాఘవన్ కూడా తన ట్విట్టర్లో కామెంట్స్ రూపంలో తెలియజేయడం జరిగింది. ఇక మరికొంతమంది సెలబ్రెటీ సైతం ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనని మెచ్చుకుంటూ కామెంట్లు చేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి