ఘట్టమనేని వారసుడు..టాలీవుడ్ ప్రిన్స్ హీరో మహేష్ బాబు కొద్ది రోజుల ముందు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్నా కరోనా పెద్ద సినిమాలు విడుదల అయ్యే క్రమంలో..అందరు కలిసి పండుగ చేసుకుందాం అని అనుకుంటున్న తరుణంలో మరోసారి నేను ఉన్నా అంటూ జెట్ స్పీడ్ లో దూసుకుంటూ వచ్చేసింది మాయదారి కరోనా. దీంతో మళ్లీ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా ఆంక్షలను అమలులోకి తెచ్చాయి. ఇక హ్యాపీగా కలిసి సంక్రాంతి పండుగ చేసుకుందాం అన్నవాళ్లకి నిరాశే మిగిలింది.

ఇక రీసెంట్ గా మనం చూస్తున్నట్లైతే ఈసారి సినీ ఇండస్ట్రీ వాళ్లు కరోనా వలలో ఎక్కువ మంది చిక్కుకున్నారు. వరుసగా బడా సెలబ్రిటీస్, స్టార్ సింగర్స్, స్టార్ డైరెక్టర్స్ అందరూ కరోనా పాజిటివ్ వచ్చిందటూ సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు కూడా కరోనా బారిన పడ్డారు. దీంతో అభిమానులు టెన్షన్ పడిపోయారు. మా అభిమాన దేవుడు త్వరగా కోలుకోవాలని పూజలు కూడా చేసారు. కాగా..రీసెంట్ గానే మహేష్ పూర్తి ఆరోగ్యవంతంగా కోలుకుని కరోనా నుండి బయటపడ్డారు. తాజాగా ఈ విషయాని ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారు. దీంతో ఫ్యాన్స్ మహేష్ కోలుకున్నాడులే అని సంబరపడే లోపే మరో బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. మహేశ్‌ బాబు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న "సర్కారు వారి పాట" సినిమా మరోసారి పోస్ట్ పోన్ అవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే చాలా సార్లు వివిధ కారణాల చేత వాయిదా పడిన ఈ సినిమా..ఇప్పుడు మహేశ్ బాబు, కీర్తి సురేష్‌ కారణంగా మళ్లీ వాయిదా పడనుంది అంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఇద్దరికి కూడా కరోనా సోకిన నేపధ్యంలో ..ఇద్దరు ఇప్పుడు షూటింగ్ కోసం బయటకు వెళ్ళాలి అంటేనే భయపడుతున్నారట. దీంతో వీళ్ళ పై చిత్రీకరించాల్సిన కొన్ని సీన్స్ పెండింగ్ లోనే ఉన్నాయట. ఇక ఈ రీజన్స్ తో చిత్రీకరణ మరింత ఆలస్యం కానున్నట్లు సమాచారం. అంతేకాక ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఏప్రిల్‌ 1 తేదికి సినిమా పూర్తయ్యే సూచనలు ఎక్కడ కనిపించట్లేదు. ఇక ఈ విధంగా చూసుకుంటే 'సర్కారు వారి పాట' మరోసారి  వాయిదా పడటం కన్ఫాం అనిపిస్తుంది  అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: