నంద‌మూరి బాల‌కృష్ణ భార్య వ‌సుంధ‌ర‌, కుమారుడు మోక్షాజ్ఞ‌తో క‌లిసి ప్ర‌కాశం జిల్లాలో సంక్రాంతి సంబురాల‌ను ఘ‌నంగా జ‌రుపుకుంటూ ఉన్నారు. రోజుకొక గెట‌ప్‌లో బాల‌య్య అభిమానుల‌కు సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. బాల‌య్య సోద‌రి అయిన‌టువంటి కేంద్ర మాజీ మంత్రి ద‌గ్గుబాటి పురేందేశ్వ‌రి ఇంట్లో పండుగ‌ను అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించుకుంటున్నారు. సంక్రాంతి పండుగ తొలి రోజు అయిన భోగి వేడుక‌ల్లో సంద‌డి చేసారు. సంక్రాంతి పండుగ రోజు భార్య వసుంధ‌ర‌, కుమారుడు మోక్షాజ్ఞ‌ల‌తో క‌లిసి గుర్రంపై ఉన్న ఫొటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేసారు. గుర్రపు స్వారీ చేసి అంద‌రినీ ఔరా అనిపించాడు బాల‌య్య‌. ముఖ్యంగా కారంచేడులో ఉన్న అభిమానుల‌కు బాల‌య్య ను  స్వ‌యంగా చూసి సంతోష‌ప‌డ్డారు. సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా శ‌నివారం రాత్రి (పండుగ రోజు)  కూడా  కుటుంబ స‌భ్యుల‌తో సంతోషంగా గ‌డిపారు.
 
ఇక ఇవాళ తాజాగా బాల‌య్య త‌న భార్య వ‌సుంధ‌ర‌తో క‌లిసి చీరాల బీచ్‌లో సంద‌డి చేసారు. టాప్‌లెస్ పోర్ట్ జీప్‌లో త‌న భార్య వ‌సుంధ‌ర‌ను ప‌క్క‌న కూర్చొపెట్టుకుని స్వ‌యంగా బాల‌కృష్ణ బీచ్ వ‌ద్ద జీపు న‌డప‌డం.. కుటుంబ స‌భ్యుల‌తో బీచ్‌లో కొద్ది సేపు గ‌డిపారు. అక్క‌డికి వ‌చ్చిన వారంద‌రూ బాల‌కృష్ణ‌ను చూసేందుకు గుమిగూడారు.

ఇక బాల‌య్య చేసిన గుర్ర‌పు స్వారీ అంద‌రినీ ఎంత‌గానో ఆక‌ట్టుకున్న‌ది. గుర్రంతో బాల‌య్య వేయించిన డ్యాన్స్ హైలెట్‌గా నిలిచింది. ముఖ్యంగా బాల‌య్య ఓ పాట పాడుతూ.. డ్ర‌మ్స్ వాయిస్తుండ‌గా.. ఆ గుర్రం ల‌య‌బ‌ద్ధంగా స్టెప్పులేసింది. గుర్రంపై బాల‌కృష్ణ పుల్ జోష్‌తో క‌నిపించారు. ఓ వైపు బాల‌య్య కుటుంబ స‌భ్యులు ప్రోత్స‌హిస్తుండ‌గా..  మ‌రొక వైపు అభిమానులు సైతం జై బాల‌య్య‌, జై జై బాల‌య్య అంటూ నినాదాల‌తో హోరెత్తించారు.

ఇక ఆ త‌రువాత అదే గుర్రం మీదకు బాల‌య్య కుమారుడు మోక్షాజ్ఞ ఎక్కి కొద్దిసేపు స్వారీ చేసారు. ఒకే ప్రేమ్‌లో తండ్రి, కొడుకుల‌ను చూసిన స్థానికుల ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. బాల‌కృష్ణ స‌తీమ‌ణితో పాటు.. ఆయ‌న వార‌సుడు మోక్షాజ్ఞ కూడా కారంచేడులో మేన‌త్త ఇంటి వ‌ద్ద ఆనందంగా గ‌డుపుతున్నారు. మొత్తానికి ద‌గ్గుబాటి వారి ఇల్లు నంద‌మూరి కుటుంబ స‌భ్యుల రాక‌తో సంక్రాంతి పండుగ వేళ భ‌లే సంద‌డి వాతావ‌ర‌ణంగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: