సంక్రాంతి సినిమాల హడావిడి పూర్తి కావడంతో ఫిబ్రవరిలో విడుదల కాబోయే సినిమాల ప్రమోషన్ మొదలైంది. ముఖ్యంగా ఫిబ్రవరి మొదటివారంలో విడుదల కాబోతున్న తన ‘శేఖర్’ మూవీ పై రాజశేఖర్ చాల ఆశలు పెట్టుకున్నాడు. ఈ మూవీతో తిరిగి తన కెరియర్ కు టర్నింగ్ పాయింట్ వస్తుందని రాజశేఖర్ భావిస్తున్నాడు.


ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజశేఖర్ మోహన్ బాబు కోపం పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. చాల సంవత్సరాల క్రితం తనకు వచ్చిన ఒక మంచి అవకాశాన్ని మోహన్ బాబు పట్ల ఉన్న భయంతో వదులుకున్న విషయాన్ని బయటపెట్టాడు. 20 సంవత్సరాల క్రితం వచ్చిన ‘హనుమాన్ జంక్షన్’ మూవీ అర్జున్ జగపతి బాబు లతో నిర్మించినప్పటికీ వాస్తవానికి ఆ సినిమాలో నటించవలసింది తాను మోహన్ బాబు అన్న విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు.


అప్పట్లో ఆ సినిమాకు సంబంధించి నిర్మాత దగ్గర అడ్వాన్స్ కూడ తీసుకున్నానని అయితే ఆమూవీలో తనతో పాటు కలక్షన్ కింగ్ మోహన్ బాబు కూడ కలిసి నటిస్తున్నాడు అని తెలియగానే తాను అడ్వాన్స్ వదులుకున్న విషయాన్ని బయటపెట్టాడు. దీనికి కారణం సినిమా షూటింగ్ 9 గంటలకు అంటే ఒక అరగంట ముందుగా మోహన్ బాబు సెట్ లో రెడీగా ఉంటాడని అయితే తాను కనీసం అరగంట లేట్ గా షూటింగ్ కు వస్తానని దీనితో తనకు మోహన్ బాబుతో అనవసరపు గొడవలు ఏర్పడతాయని తాను ఆ మూవీని వదులుకున్న విషయాన్ని ఇప్పుడు బయట పెట్టాడు.


రాజశేఖర్ ఈ మూవీ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో ఆ మూవీ నిర్మాత మోహన్ బాబును కూడ వదులుకుని ఆతరువాత అర్జున్ జగపతి బాబు లతో ఆమూవీని నిర్మించాడట. ఏది ఏమైనా మోహన్ బాబు పట్ల గౌరవంతో పాటు భయం కూడ ఉండటంతో రాజశేఖర్ ఒక మంచి హిట్ సినిమాను పోగొట్టుకున్నాడు అనుకోవాలి..మరింత సమాచారం తెలుసుకోండి: