యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ గురించి ఒక ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. కమర్షియల్ క్లాసిక్ దర్శకుడు ' కొరటాల శివతో ఎన్టీఆర్ భారీ పాన్ ఇండియా మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి మొదటి వారం నుండి యంగ్ టైగర్ ఎన్టీఆర్ - కొరటాల మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే కథ ఇంకా ఫైనల్ కాలేదని సమాచారం. ప్రస్తుతం కథని పూర్తి చేసే పనిలో డైరెక్టర్ నిమగ్నమై ఉండగా... ఇంతలో ఆయనకు ఒక అద్భుతమైన ఆలోచన వచ్చిందట, ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటుగా మరో స్టార్ హీరో కూడా కనిపిస్తే ఇంకా బాగుంటుందనే ఆలోచన వచ్చిందట కొరటాలకు.

దాంతో ఎవరైతే క్రేజీ కాంబోగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది అని అనుకుంటుండగా ఎన్టీఆర్ బాబాయ్ బాలయ్య అయితే సూపర్ గా ఉంటుందని అనుకుంటున్నట్లు సమాచారం. అంతేకాదు ఇదే మాట తారక్ తో చెప్పగా నాకు డబుల్ ఒకే అన్నట్లు తెలుస్తోంది. అయితే ఇక బాలయ్య బాబుతో మాట్లాడటం ఆయన కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే పాత్రను రెడీ చేసుకోవడమే తరువాయి. ఒకవేళ ఇదే కనుక నిజమయితే ఇందుకు నందమూరి బాలకృష్ణ కూడా ఆల్మోస్ట్ సరే అనే అంటారు ఒకపక్క అన్న కొడుకు, మరోపక్క స్టార్ డైరెక్టర్ అందులోనూ తన బ్లాక్ బస్టర్ మూవీ 'సింహ' చిత్రానికి కొరటాల రచయితగా చేసిన పరిచయము ఉంది. చూస్తుంటే అంతా ఓకే అయ్యేలా ఉంది.

ఇక ఈ లెజెండరీ కాంబో కనుక స్క్రీన్ పై కనపడితే బాక్స్ బద్దలే. మరి ఎప్పటినుండో నందమూరి ఫ్యాన్స్ కోరుకుంటున్న క్రేజీ కాంబినేషన్ కనుక ఫైనల్ అయితే స్క్రీన్ పై రచ్చ రచ్చే. అయితే ఇది సినీ వర్గాల్లో ఒక క్రేజ్య్ గాసిప్ గా నడుస్తోంది. దీని గురించి అధికారికంగా ఎవరూ ప్రకటించలేదు. ఏదైనా అద్భుతం జరిగి ఇలా జరిగితే మాత్రం ఫ్యాన్స్ కు పండగే.  

మరింత సమాచారం తెలుసుకోండి: