ఏమని ఓటీటీ వచ్చిందో కానీ..  ప్రేక్షకుల ముందుకు వరల్డ్‌ క్లాస్‌ కంటెంట్‌ అందుబాటులో ఉంటోంది. కాస్త డిఫరెంట్ సినిమాలు, సిరీసులతో బాగా కనెక్ట్ అయిపోతున్నారు ఆడియన్స్.  దీంతో రెగ్యులర్‌ ఫార్మాట్ లో ఉండే స్టోరీలకు ఆదరణ తగ్గిపోతోంది. వసూళ్లు కూడా అంతగా రావడం లేదు. ఇక లాభం లేదనుకొని హీరోలు కొత్త దారులు వెతుక్కుంటున్నారు. డిఫరెంట్ గా ఉండే స్టోరీలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.

ప్రభాస్‌ చాలా వరకు యాక్షన్ థ్రిల్లర్స్‌తోనే ప్రేక్షకులను అలరిస్తుంటాడు. అయితే పాన్ ఇండియన్ హీరోగా మారాక ప్రభాస్, సినిమా సినిమాకి మార్పు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఓం రౌత్ దర్శకత్వంలో మైథలాజికల్‌ మూవీ 'ఆదిపురుష్' చేశాడు. అలాగే నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ 'ప్రాజెక్ట్‌-కె' చేస్తున్నాడు. ఇక సందీప్ వంగా దర్శకత్వంలో చేస్తోన్న 'స్పిరిట్‌'తో మొదటిసారి ఖాకీ వేస్తున్నాడు ప్రభాస్.

రామ్ చరణ్‌ ఎక్కువగా మాస్, కమర్షియల్‌ మూవీస్‌తోనే హిట్ కొట్టాడు. అయితే 'రంగస్థలం' బ్లాక్‌బస్టర్‌తో చరణ్‌ సినిమా లైనప్‌ కూడా మార్చేశాడు. 'వినయ విధయ రామా' తర్వాత వరుసగా డిఫరెంట్‌ జానర్స్‌లోనే సినిమాలు చేస్తున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో హిస్టారికల్‌ డ్రామా 'ఆర్ ఆర్ ఆర్' చేశాడు. ఆ తర్వాత శంకర్‌ దర్శకత్వంలో పొలిటికల్ థ్రిల్లర్‌కి సైన్ చేశాడు.

రవితేజ తెలుగులో మాస్‌ కథలకి బ్రాండ్ అంబాసిడర్‌ అన్నట్లు, ఎక్కువగా కమర్షియల్‌ మూవీస్‌లోనే కనిపించేవాడు. అయితే ఈ మాస్‌ కథల్లో కూడా కొంచెం వేరియేషన్స్ చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. 'రామారావు ఆన్ డ్యూటీ'లో ఎమ్.ఆర్.వో పాత్ర పోషిస్తే, 'రావణాసుర' సినిమాలో లాయర్‌గా నటిస్తున్నాడు. రామ్ చాక్లెట్‌ బాయ్‌ లుక్‌తో ఫీమేల్‌ ఆడియన్స్‌లో మంచి ఫాలోయింగ్‌ తెచ్చుకున్నాడు. ఈ ఫ్యాన్‌బేస్‌ని శాటిస్‌ఫై చెయ్యడానికి ఎక్కువగా లవ్‌స్టోరీస్‌లోనే నటించాడు. అయితే 'ఇస్మార్ట్ శంకర్'‌ తర్వాత మాస్‌ ఆడియన్స్‌ని టార్గెట్‌ చేస్తున్నాడు. లింగుసామి దర్శకత్వంలో పోలీస్‌ ఆఫీసర్‌గా 'ది వారియర్' అనే సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత బోయపాటి దర్శకత్వంలో పక్కా మాస్‌ ఎంటర్‌టైనర్‌తో రాబోతున్నాడు.

నాని ఏడాదికి మినిమం మూడు రిలీజులు ఉండాలనే లక్ష్యంతో సినిమాలు చేస్తుంటాడు. అయితే ఇప్పుడు ప్రతీ సినిమా దేనికదే వైవిధ్యంగా ఉండాలనుకుంటున్నాడు. 'శ్యామ్‌ సింగరాయ్'లో బెంగాలీ బాబుగా కనిపించిన నాని, 'దసరా' సినిమాలో తెలంగాణ యువకుడిగా నటిస్తున్నాడు. సింగరేణి బొగ్గుగనుల నేపథ్యంలో తెరకెక్కుతోంది 'దసరా'. ఈ మూవీ కోసం నాని తెలంగాణ మాండలికం కూడా నేర్చుకుంటున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: