ఒక హీరోయిన్ తో సన్నిహితంగా రొమాన్స్ చేసే సన్నివేశాలలో మహేష్ కొద్దిగా ఇబ్బంది పడతాడు అని అంటారు. సినిమా షూటింగ్ సమయంలో కూడ మహేష్ జోక్స్ వేస్తాడు కానీ ఆ జోక్స్ లో తనతో కలిసి నటించే హీరోయిన్స్ ను ఇబ్బంది పెట్టే పదాలు మహేష్ వేసే జోక్స్ లో ఉండవు. ఇలాంటి పరిస్థితులలో ఎప్పుడులేని విధంగా మహేష్ తన రూట్ మార్చి ‘సర్కారు వారి పాట’ మూవీలో విపరీతంగా బూతు అర్థాలు వచ్చే డైలాగ్స్ వాడినట్లు లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఈమూవీ ట్రైలర్ ను చూసినవారికి అర్థం అవుతుంది.


మహేష్ కెరియర్ లో ఎప్పుడు వాడని బూతు డైలాగ్స్ ‘సర్కారు వారి పాట’ ట్రైలర్ లో వినిపించాయి. దీనితో మహేష్ మాస్ ప్రేక్షకులతో మరింత కనెక్ట్ కావడానికి ఇలాంటి డోసేజ్ పెంచాడా అన్న సందేహాలు చాలామందికి వస్తున్నాయి. ప్రస్తుతం టాప్ హీరోల మధ్య పోటీ చాల ఎక్కువగా ఉంది దీనికితోడు ‘సర్కారు వారి పాట’ ఫలితం గురించి మహేష్ కొంత టెన్షన్ పడుతున్నాడు అన్నవార్తలు కూడ ఉన్నాయి.


సాధారణంగా మహేష్ కు సెంటిమెంట్ పరంగా మే నెల అచ్చిరాదు. దీనికితోడు కీర్తి సురేష్ ఐరన్ లెగ్ సెంటిమెంట్ కూడ ఈమూవీ పై ఉంది. ఇప్పటివరకు టాప్ హీరోలతో సినిమాలు తీయని పరుశురామ్ మహేష్ ను హ్యాండిల్ చేయగలడా అన్న సందేహాలు కూడ ఉన్నాయి. ఇన్ని టెన్సన్స్ ఉండటంతో మహేష్ తన రూట్ మార్చి ఇలా బూతు డైలాగ్స్ చెప్పడానికి అంగీకరించి ఉంటాడా అన్నసందేహాలు కూడ ఉన్నాయి.


పరిస్థితులు ఇలా ఉంటే ఈమూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు పవన్ కళ్యాణ్ అతిధిగా రాబోతున్నాడు అని వస్తున్న వార్తలు విని ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి. తన అన్న చిరంజీవి సినిమాల ఫంక్షన్స్ కు కూడ పవన్ కళ్యాణ్ అతిధిగా రావడం చాల అరుదు. అలాంటి పరిస్థితులలో మహేష్ సినిమా ప్రమోషన్ కు పవన్ వస్తాడా అన్న సందేహాలు ఉన్నాయి..మరింత సమాచారం తెలుసుకోండి: