టాలీవుడ్ సినిమా పరిశ్రమలో గత కొన్ని రోజులుగా మంచి ఎంటర్టైన్మెంట్ సినిమాలను చేస్తూ వరుస సూపర్ హిట్ లను అందుకుంటున్నాడు స్టార్ హీరో అడవి శేష్. తన మొదటి సినిమా నుంచి ప్రేక్షకులందరినీ కూడా ఈ ఎంతో ఎంటర్టైన్ చేస్తూ వచ్చారు. ప్రస్తుతం ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్దం అవుతున్నాడు ఈ హీరో. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాని శశి కిరణ్ టిక్కా తెరకెక్కించగా ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ మలయాళ భాషలలో కూడా విడుదల చేస్తూ ఉండడం విశేషం.

తెలుగు హిందీ భాషలలో  ఏకకాలంలో రూపొందించిన ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుందని చెబుతున్నారు. పెద్ద సినిమాల విడుదల కారణంగా ఈ చిత్రం పలుమార్లు వాయిదా పడగా ఎట్టకేలకు జూన్ 3వ తేదీన ఈ సినిమా విడుదల కావడానికి సిద్దం అయ్యింది. తాజాగా ఈ సినిమా యొక్క ట్రైలర్ ను విడుదల చేసిన చిత్రబృందం సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో పెంచింది. అంతేకాదు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా జోరుగా చేస్తున్న చిత్రబృందం సినిమాపై అంచనాలను భారీస్థాయిలో తెచ్చింది అని చెప్పాలి.

ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఈ హీరో ఈ సినిమాకు సంబంధించిన పలు విశేషాలతో పాటు తన కెరీర్లో ఎదుర్కొన్న ఆనందకరమైన బాధాకరమైన సంఘటనలు కూడా ఆయన వెల్లడించారు. పంజా సినిమా సమయంలో పవన్ కళ్యాణ్ తనకు ఎంతగానో సపోర్ట్ చేశారు అని చెప్పారు. అంతేకాకుండా క్షణం సినిమా చూసి బన్నీ అభినందించిన విషయాన్ని కూడా వెల్లడించారు. బాహుబలి సినిమా సమయంలో ప్రభాస్ కూడా మంచి సపోర్ట్ ఇచ్చారు అని ఆయన అన్నారు. ఇప్పుడు మహేష్ బాబు కూడా ఈ సినిమాకు నిర్మాతగా సపోర్టు చేయడం తనకు కొందంత బలాన్ని చేకూరుస్తుంది అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: