క్యాస్టింగ్ కౌచ్ వివాదం అటు భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఏ రేంజ్ లో ప్రకంపనలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్న ఎంతో మంది హీరోయిన్లు మీటు ఉద్యమం పేరుతో షాకింగ్ విషయాలను బయటపెట్టారు. ఒకప్పుడు నిజాలను చెప్పేందుకు భయపడిన వారు సైతం బయటకు వచ్చి ఎంతో మంది ప్రముఖుల పేర్లు కూడా బయటపెట్టారు అనే విషయం తెలిసిందే. అయితే కాస్టింగ్ కౌచ్ పై ఇప్పటి వరకు ఎంతో మంది సినీ తారలు స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. క్యాస్టింగ్ కౌచ్ అనేది సినిమా ఇండస్ట్రీలోనే కాదు ఎక్కడైనా ఉంటుందని.. సినిమాల్లో ఎలా ముందుకు సాగాలి అన్నది మన చేతుల్లోనే ఉంటుంది అంటూ కొంతమంది మహిళలు క్యాస్టింగ్ కౌచ్ వివాదం కూడా తప్పుబట్టారు.


 ఇటీవలే క్యాస్టింగ్ కౌచ్ గురించి  ఒక టాలీవుడ్ దర్శకుడు స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇప్పటివరకు సంకీర్తన, కీచురాళ్ళు, కోకిల లాంటి సినిమాలకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ గీతాకృష్ణ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇటీవలి కాలంలో అటు యూట్యూబ్ చానళ్లకు వరుసగా ఇంటర్వ్యూ లు ఇస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్ గురించి దర్శకుడు గీతాకృష్ణ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారిపోయాయ్. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఉంటుందని చెప్పుకొచ్చాడు.


 ఆఫర్ల కోసం ఎంతో మంది హీరోయిన్లు కమిట్మెంట్ ఇస్తారని అలా అయితేనే అవకాశాలు వస్తాయని షాకింగ్ కామెంట్స్ చేశాడు. హీరోయిన్ లకు మాత్రమే కాదు సింగర్స్ విషయంలో కూడా ఇది జరుగుతుందని బాంబు పేల్చాడు దర్శకుడు గీతాకృష్ణ. తాను అందరిని అనడం లేదని ఇలాంటివీ వద్దు అనుకునేవాళ్ళు 10 నుంచి 15 శాతం మంది ఉంటారంటూ గీతాకృష్ణ చెప్పుకొచ్చాడు. ఏదేమైనా ఈ దర్శకుడు ప్రస్తుతం క్యాస్టింగ్ కౌచ్ గురించి చేసిన వ్యాఖ్యలు మాత్రం సంచలనంగా మారిపోయాయి అని చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: