అందాల ముద్దుగుమ్మ మెహరీన్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మెహరీన్, నాచురల్ స్టార్ నాని హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన కృష్ణ గాడి వీర ప్రేమ కథ మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది.  మొదటి సినిమాలో కాస్త బొద్దుగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ తన నటనతో, అందచందాలతో మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. ఇలా మొదటి సినిమాతోనే కావలసినంత క్రేజ్ ను టాలీవుడ్ ఇండస్ట్రీలో సంపాదించుకున్న మెహరీన్ ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక అవకాశాలు దక్కించుకుంది.

అవకాశాలు అనేకం దక్కించుకున్నప్పటికి ఈ ముద్దుగుమ్మకు విజయాలు  మాత్రం బాక్సాఫీస్ దగ్గర పెద్దగా లభించలేదు. ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలలో రాజా ది గ్రేట్, ఎఫ్ 2   సినిమాలు మంచి విజయాలను సాధించాయి. ఈ రెండు సినిమాలకు కూడా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. ఇది ఇలా ఉంటే తాజాగా మెహరీన్ ఎఫ్ 3 మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మే 27 వ తేదీన విడుదల కాబోతుంది.  ఇది ఇలా ఉంటే తాజాగా మేరీ ఒక అదిరిపోయే కేజీ సినిమాలో ఆఫర్ కొట్టేసింది.  ఇందుకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన వచ్చేసింది. 

అసలు విషయం లోకి వెళితే... కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయిన తలపతి విజయ్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో మెహరీన్ కు కూడా అవకాశం దక్కింది.  ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.  మరి ఈ సినిమాలో మెహరీన్ మొదటి హీరోయిన్ గా కనిపించబోతుందో,  రెండో హీరోయిన్ గా కనిపించబోతుందో, లేక ఇతర పాత్రలో కనిపించబోతుందో అనేది ఈ చిత్ర బృందం ఎలాంటి ప్రకటన చేయలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: