ప్రస్తుతం జబర్దస్త్, కామెడీ స్టార్స్ మరికొన్ని కామెడీ షోల ద్వారా, సినిమాల ద్వారా పాపులారిటీని సంపాదించుకున్నారు.ఇక  వాళ్లలో అదిరే అభి ఒకరు. ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అదిరే అభి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.అయితే లాక్ డౌన్ సమయంలో జనాలకు ఓటీటీ ఎక్కువగా అలవాటైందని అదిరే అభి చెప్పుకొచ్చారు. కాగా రాజమౌళి దగ్గర తాను పని చేసినా పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం పని చేయలేదని ఆయన అన్నారు.అయితే తనకు కొత్త విషయాలు నేర్చుకోవడం ఆసక్తి అని ఆయన చెప్పుకొచ్చారు. 

అంతేకాదు యూట్యూబ్ ద్వారా తాను తమిళం నేర్చుకున్నానని ఆయన చెప్పుకొచ్చారు.అయితే రాజమౌళి నన్ను ఎంతగానో సపోర్ట్ చేశారని ఆయన కామెంట్లు చేశారు. ఇకపోతే ప్రభాస్, అనుష్క చాలా స్వీట్ పర్సన్స్ అని అదిరే అభి కామెంట్లు చేశారు. కాగా ప్రభాస్ తో ఇంటరాక్షన్ ఫన్నీగా ఉండేదని ఆయన తెలిపారు. ఇక తాను రెమ్యునరేషన్ ను పెద్దగా పట్టించుకోనని ఆయన చెప్పుకొచ్చారు.అయితే ఆయన నాకు డబ్బులు సంపాదించడం ముఖ్యం కాదని సాఫ్ట్ వేర్ జాబ్ లో నాకు మంచి ఆఫర్లు ఉన్నాయని ఆయన తెలిపారు.అంతేకాదు  డబ్బుల కోసం సినిమాను వదిలిపెట్టిన సందర్భాలు మాత్రం లేవని ఆయన తెలిపారు.

 అయితే ఆఫర్ కావాలని వెళితే హీనంగా మాట్లాడే మేనేజర్లు చాలామంది ఉంటారని ఆయన చెప్పుకొచ్చారు. ఇకపోతే ఒకతను తనను గుర్తు పట్టని విధంగా ప్రవర్తించారని తాను అదిరే అభి అని పరిచయం చేసుకుంటే టీవీ చూడనని అవతలి వ్యక్తి చెప్పాడని అభి తెలిపారు.కాగా ఆ వ్యక్తి జబర్దస్త్ లో రోజా, నాగబాబు నిజంగా నవ్వుతారా అని అడిగాడని టీవీ చూడని వ్యక్తికి అది ఎలా తెలిసిందని అదిరే అభి ప్రశ్నించారు.ఇక  ఆ వ్యక్తి కావాలని చేస్తున్నాడనే విషయం నాకు అర్థమైందని ఆయన చెప్పుకొచ్చారు. అయితే హీరో వెంకటేష్ గారు కలిసిన రెండు మూడు సందర్భాల్లో జబర్దస్త్ లో కామెడీ భలే చేస్తారని మెచ్చుకున్నారని ఆయన చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: