బాగా ఫేమస్ అయినవారు ఉన్నారు. అలా ప్రేక్షకుల మనసు గెలుచుకున్న వారిలో ఎక్స్ప్రెస్ రవి ఒకరు. పటాస్ షో తో బాగా క్రేజ్ పెంచుకున్న ఈ ఆర్టిస్ట్ అనతి కాలం లోనే మంచి గుర్తింపు తెచ్చుకుని వరుస అవకాశాలతో టెలివిజన్ రంగం లో దూసుకుపోతున్నాడు. అయితే ప్రస్తుతం మా టివి లో ప్రసరమౌతున్న కామెడీ స్టార్ లో ఒక టీమ్ కు లీడర్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో కి జడ్జిగా నాగబాబు వారు వ్యవహరిస్తుండగా, మరొక జడ్జి గా ప్రముఖ డాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్ చేస్తున్నారు.
ఇక ఢీ షోతో పాపులర్ అయిన పిల్లి దీపికా యాంకరింగ్ చేస్తోంది. అయితే ప్రతి వారం ఒక సెలబ్రిటీ ఈ షోకి గెస్ట్ గా వస్తుంటారు. అందులో భాగంగా ఈసారి ఈ షోకి గెస్ట్ గా నటుడు, నిర్మాత అయిన బండ్ల గణేష్ వచ్చారు. కాగా ఎక్స్ప్రెస్ హరి షో లో స్కిట్ చేస్తూ బండ్ల గణేష్ సినిమాలు చేస్తే డబ్బులు వస్తాయి. ఇంటర్వ్యూ లు చేస్తే కాంట్రవర్సీ లు వస్తాయి అని అక్కడ ఉన్న వారికీ షాక్ ఇచ్చాడు. అంత పెద్ద నిర్మాతను హరి అంత మాట అనడం తో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. అయితే ఇది స్కిట్ లో భాగమే అయినా బండ్ల గణేష్ కొద ఈ విషయం గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఇలాంటివి ఉంటాయని తెలిసే గెస్ట్ లు ఈ షోలకు వస్తూ ఉంటారు.
ఈ స్కిట్ తర్వాత ఇది కేవలం వినోదం కోసమే చేశారని అర్ధం చేసుకుంటాడు బండ్ల గణేష్. ఇక తాజాగా బండ్ల గణేష్ నటించిన డేగల బాబ్జి చిత్రం 20 మే 2022 న విడుదల అయింది. చాలా కొత్త రకంగా ట్రై చేసిన ఈ సినిమా ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలం అయింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి