సినిమాలలో కూడా స్టార్ హీరోల సరసన నటించిన చిత్రాల కంటే ఈమె లేడీ ఓరియెంటెడ్ చేసిన సినిమాలు ఎక్కువగా ఉన్నాయి.. అందులో భాగంగానే ఓ-2 అనే చిత్రంలో నటిస్తోంది నయనతార ఈ సినిమా థియేట్రికలో రిలీజ్ చేయాలని భావించిన చిత్ర బృందం..కొన్ని కారణాల వల్ల ఓ టి టీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ సినిమా జూన్ 17వ తారీఖున డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ ని కూడా ఈ రోజున విడుదల చేశారు.
ఈ సినిమాలో నయనతార 6ఏళ్ల బాబుకు మదర్ గా కనిపించింది. ఆరోగ్యపరంగా ఎదుర్కొంటున్న బాలుడిని కాపాడేందుకు అమ్మగా తన వంతు ప్రయత్నాలు చేస్తూ ఉండడమే ఈ కథ శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది పడే కొడుకుని ఆసుపత్రికి తీసుకు వెళ్లాలని ఒక బస్సులో ప్రయాణిస్తూ ఉంటుంది. అలాంటి సమయంలోనే జరిగిన ఒక సంఘటన చుట్టూ కథని ఈ సినిమా నడిపించే విధంగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. నయనతార ఎన్నో చిత్రాల్లో ఎన్నో పాత్రలు నటించిన అమ్మ పాత్ర కొత్తదనం ఏమీ కాదని చెప్పవచ్చు. గతంలో కూడా పలు సార్లు ఇలాంటి పాత్రల్లో నటించి మెప్పించింది. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు మలయాళం లో కూడా ఒకేసారి విడుదల కానుంది. ప్రస్తుతం ట్రైలర్ వైరల్ అవుతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి