రాశికన్నా హీరోయిన్ గా నటించిన రెండు సినిమాలు ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు ఒకే నెలలో రాబోతున్నాయి. దీంతో ఆమె అభిమానులు తమ అందాల అభిమాన హీరోయిన్ రెండు సినిమాలలో చూడబోతున్నామని ఆనందంతో ఎగిరి గంతేస్తున్నారు. ఊహలు గుసగుసలాడే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై చబ్బీ లుక్స్ తో అందరినీ ఆకట్టుకున్న ముద్దుగుమ్మ రాశికన్నా. ఆ తర్వాత కూడా ఆమె తన అందం అభినయంతో సినిమాలలో నటించి విజయాలను సాధించి అగ్ర హీరోయిన్ గా ఎదిగింది.

పెద్ద హీరోల సినిమాలలో నటించలేదు కానీ రాశీ కన్నాకు ప్రేక్షకులలో మంచి గుర్తింపు దక్కింది. ప్రస్తుతం హీరోలకు ఒక ఆప్షన్ గా కనిపిస్తున్న రాశీ కన్నా ఇప్పుడు రెండు సినిమాలపై భారీ స్థాయిలో ఆశలు పెట్టుకుంది. వాటిలో ముందుగా గోపీచంద్ సరసన ఆమె హీరోయిన్ గా నటించిన పక్కా కమర్షియల్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జూలై 1వ తేదీన ఈ సినిమా రాబోతుండగా ఈ చిత్రంపై అభిమానులలో మంచి అంచనాలే ఉన్నాయి. మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమా తప్పకుండా మంచి విజయాన్ని అందుకుంటుంది అని అందరూ భావిస్తున్నారు. 

ఇక ఆమె హీరోయిన్ గా రాబోతున్న మరో సినిమా అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన థాంక్యూ. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం వినూత్నమైన సినిమాగా ప్రేక్షకుల ముందుకు జులై 22వ తేదీన రాబోతుంది. విభిన్న సినిమాలను తెరకెక్కించే విక్రమ్ కుమార్ సినిమాలలో హీరోయిన్ పాత్రలకు మంచి ప్రాధాన్యత ఉంటుంది ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమాలో హీరోయిన్ క మంచి పాత్రలు రాశాడు ఆ విధంగానే ఈ చిత్రంలోనూ రాసి కన్నా పాత్రను ఎంతో వైవిధ్యభరితంగా ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు సినిమాలలో కూడా మంచి పాత్రలే చేస్తున్న ఈ ముద్దుగుమ్మ వీటి ద్వారా ఎలాంటి క్రేజీ ను మూటకట్టుకుంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: