దక్షిణాదిన గొప్ప దర్శకుడుగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు దర్శకుడు శంకర్. ఇప్పుడు టాలీవుడ్ పరిశ్రమ లో స్టార్ హీరోగా ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. అంతకు ముందు ఆయన తమిళంలో కొన్ని సినిమాలు చేయగా అది ఏ మాత్రం కలసి రాకపోవడంతో తెలుగులో సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ విధంగా ఇదే తెలుగు సినిమా పరిశ్రమలో ఆయన చేస్తున్న మొదటి డైరెక్ట్ సినిమా.

అంతకుముందు కమల్ హాసన్ తో కలిసి ఆయన భారతీయుడు సినిమాను మొదలు పెట్టగా దాన్ని మధ్యలోనే ఆపేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆ విధంగా ఆ చిత్రాన్ని మధ్యలోనే ఆపేసి సినిమాలు మొదలుపెట్టిన ఈ దర్శకుడు ఇప్పుడు మళ్ళీ భారతీయుడు2 సినిమాను మొదలుపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నాడు. కమల్ హాసన్ మధ్యవర్తిగా వ్యవహరించి ఇటు నిర్మాతలకు అటు దర్శకుడికి మధ్య సయోధ్య కుదుర్చి ఈ సినిమాను తిరిగి మొదలుపెట్టే విధంగా రంగం సిద్ధం చేశాడు.

అయితే శంకర్ ఈ సినిమాను మొదలుపెట్టడంతో చరణ్ సినిమా ఆగిపోయింది అన్న వార్తలు ఎక్కువవుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రాన్ని మొ దలు పెట్టబోతున్నాడు అన్నట్లు వార్తలు బయటకు వినిపిస్తుండగా సగం చేసిన చరణ్ సినిమా ఏమవుతుంది అన్న ఆందోళన మెగా అభిమానులు కనబరుస్తున్నారు. తొందరగా దీనిపై ఒక క్లారిటీ ఇస్తే మంచిదని వారు భావిస్తున్నారు. ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ గా ఎస్టాబ్లిష్ అయిన చరణ్ ఈ చిత్రంతో తన స్టార్ దమ్ అక్కడ కొనసాగించాలని ఆయన అభిమానులు భావిస్తుండడం విశేషం. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నహాలు చేసిన నేపథ్యంలో అప్పటికి ఈ సినిమా పూర్తయి విడుదల అవుతుందా అ న్నట్లుగా వారు అనుమానాలను వ్యక్తపరుస్తున్నారు. మరి దీనిపై ఓ క్లారిటీ రావాలంటే ఎవరైనా స్పందించాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: