మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎంతటి స్థాయిలో విజయాన్ని అందుకున్నారో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆ సినిమాలో ఇద్దరు హీరోలు నటించిన కూడా ఎక్కువ శాతం పేరును రామ్ చరణ్ సంపాదించుకున్నాడు అన్నది మెగా అభిమానులు చెబుతున్న మాట. పోలీస్ ఆఫీసర్ గా ఎంతో బాధ్యతగా నటించి ఈ సినిమా విజయంలో ఎక్కువ భాగం క్రెడిట్ తీసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయనకు దేశవ్యాప్తంగా ఏర్పడిన క్రేజ్ దృష్ట్యా ఇప్పుడు చేయబోయే తదుపరి సినిమా పై అందరూ దృష్టి పెట్టారు.

సౌత్ లోనే అగ్ర దర్శకుడిగా ఉన్న శంకర్ రామ్ చరణ్ తో చేయబోయే సినిమాపై అందరూ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా యొక్క షూటింగ్ శెరవేగంగా జరుపుకుంటుంది. ప్రస్తుతానికి ఈ సినిమా ఫైనల్ స్టేజ్ చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమా తర్వాత కూడా రామ్ చరణ్ కొంతమంది క్రేజీ దర్శకులతో చేయడానికి సిద్ధమవుతున్నాడు. అయితే దర్శకులతో కాకుండా మీడియం రేంజ్ దర్శకులతో ఆయన సినిమా చేయడానికి సిద్ధమవుతూ ఉండడం నిజంగా పెద్ద ప్రయోగమే చేస్తున్నాడని చెప్పాలి.

జెర్సీ సినిమాతో జాతీయ స్థాయిలో అవార్డు అందుకున్న గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చరణ్ ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. అయితే అభిమానులు చెబుతున్న దాని ప్రకారం చరణ్ తదుపరి సినిమాలో పట్ల క్లారిటీని మెయింటైన్ చేయడం లేదని వారు చెబుతున్నారు. చాలామంది హీరోలు క్రేజీ దర్శకులను లైన్లో పెట్టుకుంటూ ఉంటుంటే చరణ్ మాత్రం ఫ్లాప్ ఫామ్ లో లేని దర్శకులను మీడియం రేంజ్ దర్శకులతో సినిమాలు చేయడం పట్ల వారు కొంత నిరాశగా ఉన్నారు. మరి ఏ కారణంగా ఈ విధమైన దర్శకుడు తో సినిమాలు ఒప్పుకున్నాడో చూడాలి. వచ్చే ఏడాది సంక్రాంతికి చరణ్ శంకర్ సినిమా విడుదల చేయడానికి నిర్మాత దిల్ రాజు ప్రయత్నాలు చేస్తున్నాడు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: