సుడిగాలి సుదీర్ , అనసూయ , సునీల్ , వెన్నెల కిషోర్ , బ్రహ్మానందం ,  పృథ్వి , శ్రీనివాస్ రెడ్డి ,  విష్ణు ప్రియ ,  దీపిక పిల్లి , నిత్య శెట్టి తది తరులు ముఖ్య పాత్ర లలో తెరకెక్కిన మూవీ వాంటెడ్ పండుగాడు . ఈ మూవీ కి శ్రీధర్ సిపాన దర్శకత్వం వహించగా , సాయిబాబా కోవెలమూడి , వెంకట్ కోవెలమూడి ఈ మూవీ కి నిర్మాతలుగా వ్యవహరించారు . 

మూవీ కి రాఘవేంద్రరావు సమర్పకులుగా వ్యవహరించారు . ఇది ఇలా ఉంటే ఈ మూవీ ఆగస్టు 19 వ తేదీన మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయ్యింది . అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను ఏ మాత్రం అందుకోలేక పోయింది . దానితో ఈ మూవీ కి మూవీ యూనిట్ ఆశించిన రేంజ్ లో కలెక్షన్ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కలేదు. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను అందు కోలేక పోయిన వాంటెడ్ పండుగాడు మూవీ మరి కొన్ని రోజుల్లోనే 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లోకి రాబోతుంది.

తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. వాంటెడ్ పండుగాడు మూవీ ప్రముఖ 'ఓ టి టి' సంస్థలలో ఒకటి అయినటు వంటి ఆహా  'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో సెప్టెంబర్ 2 వ తేదీ నుండి స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ విషయాన్ని ఆహా 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ అధికారికంగా ప్రకటించింది. మరి థియేటర్ లలో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేకపోయిన ఈ మూవీ 'ఓ టి టి' ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: