పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా సినిమాలకు కాస్త దూరంగా ఉన్నారు. ఆ తరువాత వకీల్ సాబ్ సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. బ్యాక్ టు బ్యాక్ వరుస రీమిక్స్ సినిమాలను తెరకెక్కిస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్. అలా హరిహర వీరమల్లు సినిమా తో మొదటిసారిగా పాన్ ఇండియన్ హీరోగా కూడా పేర్కొన్నారు. ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు అంతేకాకుండా పవన్ కళ్యాణ్ సినిమాలో చాలా స్పెషల్ గా కనిపించబోతున్నారు.ఈ చిత్రాన్ని డైరెక్టర్ క్రిష్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.


అయితే ఇప్పటివరకు ఈ ప్రాజెక్టు ముందుకు వెళుతుందా లేదా అనే అనుమానాలు అభిమానులలో కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పవర్ గ్లాస్స్ అనే పేరుతో ఒక ప్రత్యేకమైన వీడియోను కూడా విడుదల చేయడం జరిగింది. ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ట్రీట్ ఇవ్వడం కూడా జరిగింది. దీంతో చిత్రం ఓ రేంజ్ లో ఉంటుందని అంచనాలు పెట్టుకున్నారా అయితే గత కొన్ని నెలలుగా ఈ సినిమా షూటింగ్ కూడా జరగలేదని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గతంలో ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ కి పూర్తి చేస్తారని వార్తలు వినిపించాయి కానీ ఇప్పుడు పవన్ డేట్స్ ఖాళీగా లేకపోవడంతో ఈ సినిమా పూర్తి చేయలేరనే విషయం వైరల్ గా మారుతోంది.


ఇక పవన్ కళ్యాణ్ హెయిర్ కట్ చేసుకుని లైట్గా గడ్డంతో కనిపించడం జరిగింది పవన్ జనసేన పార్టీ కార్యాలయంలో కనిపించిన లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది. మళ్లీ హరిహర వీరమల్లు తాజా షెడ్యూల్ కి ఇస్తున్నారా అన్నట్లుగా అభిమానుల పలు అనుమానాలు మొదలవుతున్నాయి. ఇక ప్రస్తుతం ఇవే కాకుండా భవదీయుడు భగత్ సింగ్, డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరొక సినిమాలో కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం విచిత్రాలు అన్ని ఆగిపోయినట్టుగానే వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: