సినీ ప్రేక్షకులందరికీ కూడా డాన్స్ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సుమారు 10 భాషలలో కూడా 800 కు పైగా సినిమాలలో ఆయన డాన్స్ కొరియోగ్రఫీ చేశారు.. ఈ క్రమంలోనే ప్రేక్షకులందరికీ కూడా ఆయన డాన్స్ కొరియోగ్రఫీ ద్వారా ఎంతగానో దగ్గర అయ్యాడు అన్న విషయం తెలిసిందే. ఇక తెలుగులో మగధీర సినిమాలోని ధీర ధీర అనే పాట ద్వారా బాగా గుర్తింపు సంపాదించుకున్నాడు శివశంకర్  మాస్టర్. ఈ పాటకు డాన్స్ సమకూర్చినందుకుగాను జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు.


 క్లాసికల్ డాన్స్ లో శివ శంకర్ మాస్టర్ లా హావభావాలు పలికించేవారు. స్టెప్పులు చేసేవారు ఎవరు సాటి లేరు అని చెప్పాలీ. కాగా 2021 సంవత్సరంలో కరోనా వైరస్ కారణంగా శివశంకర్ మాస్టర్ ఇండస్ట్రీకి దూరమైపోయారు. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ స్వర్గస్తులు అయ్యారు అని చెప్పాలి. అయితే శివ శంకర్ మాస్టర్ మరణించడానికి కేవలం కరోనా వైరస్ మాత్రమే కారణమని ఎంతోమంది అనుకున్నారు. కానీ అతను కరోనా వైరస్ బారిన పడకముందు ఎదుర్కొన్న ఎన్నో మానసిక సమస్యలు కూడా ఆయన మారడానికి కారణమన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.


 గతంలో తన కోడలు కారణంగా ఎన్నో మానసిక వేదనలు అనుభవించాను అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు శివ శంకర్ మాస్టర్. శివశంకర్ మాస్టర్ పెద్దకొడుకు బెంగళూరుకు చెందిన జ్యోతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి మధ్య మనస్పర్దలు రాగా విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కారు. కానీ జ్యోతి మాత్రం గతంలో తనను మానసికంగా వేధించడం వల్లే పోలీసులను ఆశ్రయించానని విడాకులు కోరింది. మొదట భర్తపై ఆరోపణలు చేసిన జ్యోతి తర్వాత మామ శివ శంకర్ మాస్టర్ జీవన భృతి చెల్లిస్తానని మాట తప్పడం కారణంగానే ధర్నా చేస్తున్నట్లు తెలిపింది. తన భర్త ఇంట్లో కాస్త చోటు ఉంటే చాలు అంటూ పరువు మొత్తం రోడ్డుకు ఈడ్చింది. ఈ విషయం తనను తీవ్ర మానసిక వేదనకు గురి చేసిందని శివశంకర్ మాస్టర్ చెప్పుకొచ్చారు.. అంతేకాకుండా తనపై లైంగిక వేధింపుల కేసులు పెట్టిందని కూడా చెప్పుకొచ్చారు ఆయన. ఇలా కోడలు వల్ల ఎంతో మానసిక వేదన అనుభవించడం కారణంగా చివరికి కరోనా నుంచి కోలుకోలేక చివరికి మృతి ఒడిలోకి చేరారు అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: