యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చాలా టాలెంటెడ్ అనే సంగతి తెలిసిందే. అందరితో సరదాగా ఉండే తారక్ ఛాన్స్ దొరికితే ఇతరులను అయితే తెగ ఆట పట్టిస్తూ ఉంటారు. స్వాతిముత్యం హీరో బెల్లంకొండ గణేష్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తారక్ గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారట.

నాకు కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువగా ఉందని నేను చిన్నప్పటి నుంచి సెట్ లోనే పెరిగానని ఫీలవుతానని గణేష్ అన్నారు.

నాకు 6 సంవత్సరాల వయస్సు ఉన్న సమయంలో ఆది సినిమా షూటింగ్ జరిగిందని గణేష్ చెప్పుకొచ్చారట.. అప్పటినుంచి సెలవులు ఉండి షూటింగ్ జరుగుతుంటే షూట్ జరుగుతున్న ప్లేస్ కు వెళ్లిపోయేవాడినని గణేష్ కామెంట్లు చేశారు. సెట్ వాతావరణాన్ని నేను చాలా ఇష్టపడతానని గణేష్ పేర్కొన్నారు. బయటినుంచి షూటింగ్ సెట్ ను చూస్తే ఎవరు ఏం చేస్తున్నారో అర్థం కాదని గణేష్ కామెంట్లు చేశారు.

మానిటర్ దగ్గరికి వెళ్లి చూడగానే ఒక చిన్న షాట్ కోసం 200 మంది పని చేయడం నాకు చాలా ఆసక్తిని పెంచిందని గణేష్ అన్నారు.

సెట్ లో ఏదో ఒక పని చేయాలని అనుకున్నానని యాక్టర్ గా ఛాన్స్ రావడంతో యాక్టింగ్ చేస్తున్నానని గణేష్ చెప్పుకొచ్చారు. తెలుగు ఆడియన్స్ రిజెక్ట్ చేసినా ఇండస్ట్రీలోనే ఏదో ఒక విధంగా ఉంటానని గణేష్ అన్నారట.నాకు మొదట వాచ్ లో టైమ్ చూసుకోవడం నేర్పించింది కూడా జూనియర్ ఎన్టీఆర్ గారే అని గణేష్ తెలిపారు.
ఆది షూటింగ్ కోసం ఆస్ట్రేలియాకు వెళ్లగా వాచ్ లో టైమ్ ఎలా చూడాలో చెప్పినందుకు నా దగ్గర నుంచి 10 డాలర్లు, అన్నయ్యకు టైమ్ ఎలా చూడాలో నేర్పించి అన్నయ్య దగ్గర 10 డాలర్లు మొత్తం 20 డాలర్లు తారక్ తీసుకున్నారని గణేష్ చెప్పుకొచ్చారట.. ఆ సినిమా ఎక్స్ పీరియన్స్ ఫన్ ఎక్స్ పీరియన్స్ అని గణేష్ వెల్లడించార ని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: