కమెడియన్ గా మాత్రమే కాకుండా డాన్సర్ గా మెజీషియన్ గా కూడా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాడు. ఇక ఈటీవీలో ఉన్న అన్ని షో లకు కూడా మూలస్థానంభంగా మారిపోయి రేటింగ్స్ పెంచడంలో సుధీర్ కీలకపాత్ర వహించాడు. కానీ అనూహ్యంగా మొన్నటికి మొన్న సుదీర్ జబర్దస్త్ నుంచి తప్పుకొని మాటీవీలో ప్రత్యక్షమయ్యాడు. అక్కడ ఒక షోకి యాంకర్ గా చేయగా ఇప్పుడు ఆ షో పూర్తి కావడంతో సుదీర్ చేతిలో ఎలాంటి షోలు లేక ఖాళీగా ఉన్నాడు అనే వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే సుదీర్ మళ్ళీ జబర్దస్థ్ లోకి వస్తే బాగుండు అని ఎంతోమంది కోరుకుంటున్నారు.
ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సుడిగాలి సుదీర్ కి కూడా ఇదే ప్రశ్న ఎదురయింది. మీ జీవితంలో టర్నింగ్ పాయింట్ ఏంటి అని యాంకర్ ప్రశ్నించగా.. జబర్దస్త్ జబర్దస్త్ షో నా జీవితాన్ని మార్చేసింది అంటూ సుదీర్ సమాధానం చెప్పాడు. అలాంటి షో ని ఎందుకు వదిలేసారు అంటూ యాంకర్ ప్రశ్నించగా.. తాను షో వదిలేయలేదని.. కొంత గ్యాప్ ఇచ్చానని.. ఆరు నెలలు బ్రేక్ తీసుకున్నానని.. ఆర్థిక సమస్యల వల్ల ఇక ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఈ విషయం జబర్దస్త్ నిర్మాతలకు చెప్పగానే వాళ్ళు కూడా ఒప్పుకున్నారని సుడిగాలి సుదీర్ చెప్పాడు. దీన్నిబట్టి చూస్తే సుదీర్ త్వరలో జబర్దస్త్ లోకి రీ ఎంట్రీ ఇవ్వన్నాడు అని తెలుస్తుంది. దీంతో అభిమానులు ఆనందానికి అవతల్లేకుండా పోయాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి