పవన్ అభిమానులు తమ హీరో నటించే సినిమాల స్థాయి హిమాలయాల అంత ఎత్తు ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అందుకే ‘భవధీయుడు భగత్ సింగ్’ సినిమా టైటిల్ పేరు వినగానే ఆ మూవీ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ఎంతగానో ఎదురు చూశారు. అయితే రాజకీయాలలో పడిపోయిన పవన్ తన అభిమానుల కోరికను తీర్చే స్థితిలో ఇప్పుడు లేడు.


పవన్ నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ మూవీ ఎప్పుడు విడుదల అవుతుందో కూడ ఆమూవీ నిర్మాతలకు కూడ తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థితులలో కొరటాల శివ జూనియర్ ల కాంబినేషన్ లో త్వరలో ప్రారంభం కాబోతున్న మూవీ టైటిల్ పేరు విని పవన్ అభిమానులకు షాక్ అవ్వడమే కాకుండా తీవ్ర అసహనానికి కూడ లోనవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.


దీనికికారణం వీరాభిమాని ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఎప్పుడు పవన్ గురించి మాట్లాడినా అతడిని ‘దేవర’ అన్న పేరుతో పిలుస్తూ ఎప్పటికైనా తాను పవన్ తో తీసే సినిమాకు ‘దేవర’ అన్న టైటిల్ పెడతానని చెపుతూ ఉండేవాడు. ఈ టైటిల్ తో పవన్ అభిమానులు బాగా కనెక్ట్ అయిపోయారు. ఇప్పుడు ఇదే టైటిల్ ను దర్శకుడు కొరటాల శివ కబ్జా చేసి తాను జూనియర్ తో తీయబోతున్న లేటెస్ట్ మూవీకి ‘దేవర’ అన్న టైటిల్ పెట్టబోతున్నట్లు లీకులు ఇవ్వడంతో పవన్ అభిమానులు షాక్ లో ఉన్నారు.


తాము ఎంతగానో కోరుకుంటున్న ఇలాంటి పవర్ ఫుల్ టైటిల్ జూనియర్ సినిమాకు వెళ్ళిపోవడం ఏమిటి అంటూ పవన్ అభిమానుల బాధ. కొరటాల ‘ఆచార్య’ తరువాత జూనియర్ తో తీస్తున్న సినిమాకు ఇలాంటి పవర్ ఫుల్ టైటిల్ పెట్టడం ఇప్పుడు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ఇప్పటికే అనేకసార్లు మార్పులు జరిగిన ఈమూవీ కథలో జూనియర్ నేటి కలుషిత రాజకీయ వ్యవస్థ పై తిరుగుబాటు చేసే ఆవేశపూరిత పాత్రలో కనిపించబోతున్నాడని లీకులు వస్తున్నాయి..




మరింత సమాచారం తెలుసుకోండి: