కెరీర్‌ లో ఎక్కువ గా లవర్‌ బాయ్ పాత్రల్లో నే కనిపించారు నితిన్‌. చాలా రోజుల తర్వాత తన 32వ సినిమా లో ఔట్ అండ్ ఔస్ మాస్ క్యారెక్టర్‌ లో కనిపించ బోతున్నారు.ఈ సినిమా కు వక్కంతం వంశీ దర్శకత్వం వహి స్తున్నాడు. ఆదివారం నుంచి మారేడుమిల్లి లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభ మైనట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

నితిన్ మాస్ లుక్ ఫొటో ను సోషల్ మీడియా ద్వారా అభిమానుల తో పంచు కున్నారు. నితిన్ ముఖాన్ని కాకుండా బ్యాక్ లుక్ మాత్రమే ఇందు లో చూపించారు. ఈ సినిమా లో పొడవైన గడ్డం, మీసాల తో రఫ్ లుక్ ‌లో నితిన్ కనిపించ బోతున్నట్లు తెలుస్తోంది. మారేడుమిల్లి లో జరిగే ఈ ఫస్ట్‌ షెడ్యూల్ ‌లో యాక్షన్ సన్నివేశాల ను చిత్రీకరించ బోతున్నట్లు సమాచారం.

సినిమా లో నితిన్ ‌కు జోడీ గా శ్రీలీల హీరోయిన్‌ గా నటిస్తోంది. శ్రేష్ట్ మూవీస్‌, ఆదిత్య ఎంటర్‌ టైన్‌మెంట్స్‌ పతాకాల పై నితిన్ ఫాదర్ సుధాకర్‌రెడ్డి, సోదరి నిఖితారెడ్డి ఈ సినిమా ను నిర్మిస్తోన్నారు.

ఏప్రిల్‌లో నితిన్ 32వ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దాదాపు ఎనిమిది నెలల విరామం తర్వాత షూటింగ్ మొదలుపెట్టడం ఆసక్తి ని రేకెత్తిస్తోంది. ఒకానొక దశలో ఈ సినిమా ఆగిపోయినట్లు ప్రచారం జరిగింది. షూటింగ్ మొదలుపెట్టి పుకార్ల కు పుల్‌స్టాప్ పెట్టారు చిత్ర యూనిట్‌.

ఈ ఏడాది ఆగస్ట్‌ లో మాచర్ల నియోజకవర్గం సినిమా తో నితిన్ ప్రేక్షకుల ముందు కొచ్చాడు. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గా రూపొందిన ఈ సినిమా పరాజయం పాలైంది. ఈ సినిమా రిజల్ట్ తర్వాత కథల విషయం లో నితిన్ జాగ్రత్త వహించినట్లు తెలిసింది. వక్కంతం వంశీ స్టోరీపై రీ వర్క్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: