టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న యువ హీరో లలో ఒకరు అయినటు వంటి ఆది సాయి కుమార్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆది సాయి కుమార్ ఇప్పటికే అనేక మూవీ లలో నటించాడు. అందులో భాగంగా ఆది సాయి కుమార్ ఇప్పటికే ప్రేమ కావాలి , లవ్లీ మూవీ లతో మంచి విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. లవ్లీ మూవీ తర్వాత అనేక మూవీ లలో హీరో గా నటించినప్పటికీ ఆది సాయి కుమార్ కు సరైన విజయం బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు లభించలేదు. కాకపోతే ఆది సాయి కుమార్ హిట్. ఫ్లాప్ లతో  ఏ మాత్రం సంబంధం లేకుండా వరుస మూవీ లలో నటిస్తూ ప్రేక్షకులను పలకరిస్తున్నాడు. 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఆది సాయి కుమార్ "టాప్ గేర్" అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ కి  కె.శశికాంత్ దర్శకత్వం వహిస్తుండగా , శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్  బ్యానర్ పై ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో కే వి శ్రీధర్ రెడ్డి భారీ బడ్జెట్ తో ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని మరి కొన్ని రోజుల్లోనే విడుదల చేయనున్నారు. తాజాగా టాప్ గేర్ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక అదిరిపోయే అప్డేట్ ను విడుదల చేసింది. టాప్ గేర్ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి టీజర్ ను డిసెంబర్ 3 వ తేదీన ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు , ఈ మూవీ టీజర్ ను టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ లలో ఒకరు అయినటు వంటి మారుతీ విడుదల చేయనున్నట్లు తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను విడుదల చేసింది. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: