తెలుగులో ఇప్పటికే సాదాసీదా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకుల బుట్ట బొమ్మగా మారిపోయిన పూజా హెగ్డే స్టార్ హీరోలు అందరి సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటుంది. ఇప్పటికే అందరూ స్టార్ హీరోలతో జతకట్టింది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే ఇప్పుడు బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అక్కడ కూడా వరుస అవకాశాలు అందుకుంటుంది. అయితే ఎంతలా అవకాశాలు అందుకున్న అక్కడ హవా నడిపించాలంటే మాత్రం సక్సెస్ కూడా అంతే ముఖ్యం.


 ఈ క్రమంలోనే బాలీవుడ్లో పలు సినిమాలతో పూజా హెగ్డే ఆలరించినప్పటికీ ఎందుకో ఆశించిన స్థాయిలో హిట్ మాత్రం కొట్టలేకపోయింది అని చెప్పాలి. అయితే ఇటీవల కాలంలో వరుస ప్లాపులతో సతమతమవుతున్నప్పటికీ ఆమెకు అవకాశాల హోరు మాత్రం ఎక్కడ తగ్గడం లేదు. ఇకపోతే గత కొంతకాలం నుంచి సక్సెస్ లేక దిగాలుగా ఉన్న బుట్ట బొమ్మ ఇక ఇప్పుడు ఒక్క సినిమా పైనే భారీగా ఆశలు పెట్టుకుంది అన్నది మాత్రం తెలుస్తుంది. ఇటీవల పూజా హెగ్డే సర్కస్ అనే సినిమాలో నటించింది అన్న విషయం తెలిసిందే.


 రోహిత్ శెట్టి దర్శకత్వంలో రణ్ వీర్ సింగ్ హీరోగా.. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది ఈ సినిమా. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది పూజ హెగ్డే. ఈ సినిమాతో సూపర్ హిట్ సాధించాలని ఎన్నో కలలు కంటుంది ఈ ముద్దుగుమ్మ. ఎందుకంటే ఈ సినిమాతో విజయం దక్కితే ఇక బాలీవుడ్లో మరికొంత కాలం తన జెండా ఎగరేయవచ్చు అని ఆలోచనలో ఉందట ఈ ముద్దుగుమ్మ. ఈనెల 23వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే హృతిక్ రోషన్ లాంటి పెద్ద హీరోతో జతకట్టి ఒక భారీ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మకు మొదటి అడుగులోనే చేదు అనుభవం నటించింది.  సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో చివరికి మళ్ళీ టాలీవుడ్ లో అడుగుపెట్టి నిలదొక్కుకుంది. ఇక ఇప్పుడు మళ్లీ బాలీవుడ్ వైపు అడుగులు వేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: