వరస ఫ్లాప్ లతో సతమతమైపోతున్న నాని తన లేటెస్ట్ మూవీ ‘దసరా’ విడుదల కాకుండానే నిర్మాతగా ‘హిట్ 2’ తో సూపర్ సక్సస్ అయ్యాడు. ఈమధ్య కాలంలో ధియేటర్లకు రావడం తగ్గించివేసిన ప్రేక్షకులను తిరిగి ధియేటర్లకు రప్పించేలా ‘హిట్ 2’ సూపర్ సక్సస్ అయింది. ఈమూవీ తరువాత హిట్ సిరీస్ లో రాబోతున్న ‘హిట్ 3’ లో నాని హీరోగా నటిస్తున్నాడు అన్న విషయం ‘హిట్ 2’ చివరిలో అందరికీ అర్థం అయింది.  


అయితే పోలీసు ఆఫీసర్ పాత్రలో నాని ఎంతవరకు ‘హిట్ 3’ లో రాణిస్తాడు అన్న చర్చలు అప్పుడే మొదలైపోయాయి. నాని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుండి పక్కింటి అబ్బాయి అన్న ఇమేజ్ తో చాలపాత్రలు చేసాడు. అలా చేసిన సినిమాలలో చాలావరకు నాని కెరియర్ లో హిట్ గా నిలిచాయి.  


డిఫరెంట్ రోల్స్ చేయాలి అని తపన ఉన్న నాని ‘వి’ మూవీలో నెగిటివ్ టచ్ రోల్ లో అలాగే ‘కృష్ణార్జున యుద్ధం’ ‘గ్యాంగ్ లీడర్’ ‘టక్ జగదీష్’ లాంటి సినిమాలలో డిఫరెంట్ పాత్రలను చేయాలని ప్రయత్నించి మాస్ హీరోగా ఎదగాలని నాని ఎంతగానో ప్రయత్నించాడు. అయితే ప్రేక్షకులు అతడి ప్రయత్నాలకు ఆమోద ముద్ర ప్రేక్షకుల నుండి పడలేదు. ఇలాంటి పరిస్థితులలో నాని లేటెస్ట్ గా నటిస్తున్న ‘దసరా’ మూవీలో చేస్తున్న మాస్ హీరో ప్రయత్నాన్ని ఎంతవరకు ప్రేక్షకులు ఆదరిస్తారు అన్న విషయమై నాని మాస్ హీరో కెరియర్ ఆధారపడి ఉంది.


ఇది ఇలా ఉంటే ఫ్యామిలీ హీరోగా నాని ఏర్పరుచుకున్న స్థానానికీ గురిపెడుతూ చాలామంది హీరోలు ప్రయత్నిస్తున్నారు. దీనికితోడు సిద్దూ జొన్నలగడ్డ విశ్వక్ సేన్ లాంటి యంగ్ హీరోలు యూత్ లో తమ ఇమేజ్ ని విపరీతంగా పెంచుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో పూర్తి మాస్ హీరోగా నాని చేస్తున్న ప్రయత్నాలు సక్సస్ కాకపోతే నాని తన ఫ్యామిలీ హీరో స్థానాన్ని పోగొట్టుకోవడమే కాకుండా అటు మాస్ హీరోగా కూడ పూర్తిగా సక్సస్ కాలేక నాని స్థానం ఎక్కడ ఉందో తెలియక కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి ఉండవచ్చు అంటూ కొందరు విశ్లేషకుల అభిప్రాయం..

మరింత సమాచారం తెలుసుకోండి: