విజువల్ వండర్ అవతార్ కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. హైలెవెల్ గ్రాఫిక్ వర్క్ తో ప్రేక్షకులను ఒక సరికొత్త ఊహా ప్రపంచానికి తీసుకెళ్లిందీ సినిమా.
పండోరా లోకం, అక్కడి మనుషులూ, ఆ వింత జీవులు, వాటితో హీరోచేసే సాహసాలు ప్రేక్షక లోకాన్ని ఆశ్చర్యపరిచాయి. అందుకే ఆ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ను సంపాదించుకుంది. దానికి సీక్వెల్ గా వస్తున్నదే..'అవతార్ ది వే ఆఫ్ వాటర్' .

అవతార్ 2 పై భారీ అంచనాలకు కారణం 2009 లో అవతార్ విడుదలైనప్పుడు రేగిన బాక్సాఫీస్ దుమారమే. మన కరెన్సీలో మాట్లాడుకుంటే. ఆ సినిమా నిర్మాణానికి అయిన ఖర్చు 12 వేల కోట్లు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 24 వేల కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది. ఇందులోనే రీ రిలీజ్ వసూళ్లు కూడా ఉన్నాయి. ఇదే ఇప్పటి వరకూ నమోదైన భారీ రికార్డ్. ఇన్ని వేల కోట్లు వసూలు చేసిన మరో సినిమా భూమ్మీదే లేదు.

అయితే కామెరూన్ కి హిందూ సంప్రదాయం అంటే చాలా అభిమానం. అందుకే అవతార్ పేరును సంస్కృతం నుంచి తీసుకున్నాడు. మన పురణాల్లోని రాముడు, కృష్ణుడు, విష్ణుమూర్తి రూపాల స్ఫూర్తితో అవతార్ క్యారెక్టర్లకు నీలం రంగు ఎంచుకున్నాడు. ఇక అవతార్ చరిత్రాత్మక విజయంతో దర్శకుడు
కామెరూన్ సీక్వెల్ ప్రకంటించాడు. మొదట్లో 2014 లోనే అవతార్ 2 విడుదల చేద్దామని అనుకున్నారు.. కాని విపరీతమైన ప్రీ ప్రొడక్షన్ పనుల కారణంగా పలు మార్లు వాయిదా పడింది. తరువాత కోవిడ్ ప్రభావం కారణంగా నిర్మాణ పనులు ఆగిపోయాయి. ఎట్టకేలకు అవతార్ 2 షూటింగ్, ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసుకొని ఈ నెల్లో విడుదలకు సిద్దమైంది.

భారీ సాంకేతిక ప్రమాణాలతో తీర్చిదిద్దిన ఈ చిత్రాన్ని త్రీడి, 4కె,5కె,8కె వీడియో ఫార్మాట్ లలో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 160 భాషల్లో విడుదల కానుంది. అయితే 160 భాషల్లో ఓకే సారి విడుదలైన చిత్రం మరొకటి లేక పోవడం మరో విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: