యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన కెరియర్ లో ఆది మూవీ తో మొట్ట మొదటి బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ బ్లాక్ బస్టర్ మూవీ కి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మాస్ దర్శకుడుగా కెరియర్ ను కొనసాగిస్తున్న వి వి వినాయక్ దర్శకత్వం వహించగా ... మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించాడు. మణిశర్మమూవీ కి అందించిన సంగీతం ఈ మూవీ విజయంలో కీలక పాత్రను పోషించింది. 

మూవీ లోని ఎన్టీఆర్ నటనకు గాను ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. కీర్తి చావ్లామూవీ లో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటించింది.  28 మార్చ్ 2002 వ సంవత్సరం భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని అద్భుతమైన కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఇలా ఆ సమయంలో అద్భుతమైన విజయం అందుకున్న ఈ సినిమాను మళ్ళీ థియేటర్ లలో విడుదల చేయబోతున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ చిత్ర బృందం విడుదల చేసింది.

ఎన్టీఆర్ కెరియర్ లో బ్లాక్ బాస్టర్ గా నిలిచినటు వంటి ఆది మూవీ ని మే 20 వ తేదీ నుండి ... మే 28 వ తేదీ వరకు థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. మరి అప్పట్లో ఆది మూవీ తో అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న ఎన్టీఆర్ మరి ఈ రిలీజ్ లో భాగంగా ఏ రేంజ్ కలెక్షన్ లను అందుకుంటాడో చూడాలి. ఈ మూవీ రీ రిలీజ్ కోసం ఎన్టీఆర్ అభిమానులు చాలా సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: