చిరంజీవి డైలాగ్స్ ను అతడి బాడీ ల్యాంగ్వేజ్ ని అతడు వేసే స్టెప్స్ ను ఎందరో హీరోలు అనుసరించారు కాని పవన్ కళ్యాణ్ ఎప్పుడు తన అన్న బాడీ ల్యాంగ్వేజ్ ని అనుసరించలేదు. కనీసం చిరంజీవి సూపర్ హిట్స్ సాంగ్స్ ను తన సినిమాలలో రీ మిక్స్ చేసిన సందర్భాలు కూడ లేవు. అయితే చిరంజీవి మాత్రం తన తమ్ముడు పవన్ కళ్యాణ్ బాడీ ల్యాంగ్వేజ్ ని అనుసరించడం షాకింగ్ న్యూస్ గా మారింది.


తమ దారులు వేరైనా గమ్యం ఒక్కటే అంటూ చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ గురించి అనేకసార్లు ప్రస్తావించిన విషయం తెలిసిందే. వచ్చేనెల ఆగష్టు 15ను టార్గెట్ చేస్తూ రాబోతున్న ‘భోళా శంకర్’ మూవీలో చిరంజీవి పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ ‘బంగారం’ ‘పంజా’ సినిమాలలోని పవన్ బాడీ ల్యాంగ్వేజ్ ని యధాతధంగా అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది.


ఈవిషయాన్ని స్వయంగా చిరంజీవి కూడ ఒక మీడియా ఇంటర్వ్యూలో చెప్పడంతో ‘భోళా శంకర్’ మూవీకి అత్యంత భారీ ఓపెనింగ్స్ రావడానికి పవన్ అభిమానుల సహకారం కూడ లభిస్తుంది. వాస్తవానికి ఈమూవీ దర్శకుడు మెహర్ రమేష్ ఫ్లాప్ ల పర్వంలో ఉండటంతో కొందరికి ఈమూవీ పై కొన్ని సందేహాలు ఉన్నాయి. అయితే ఈమధ్య విడుదలైన మూవీ టీజర్ అదేవిధంగా ఈమూవీలోని పాటలు అంచనాలను తలక్రిందులు చేసేవిగా కనిపిస్తున్నాయి.


చిరంజీవి నటించిన కొన్ని సినిమాలలో పవన్ అక్కడక్కడా అతిధి పాత్రలలో కనిపించినప్పటికీ వారిద్దరు కలిసి నటించే మల్టీ స్టారర్ కోసం మెగా అభిమానులు ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నారు కాని అలా జరగడంలేదు. దీనితో ఆ అసంతృప్తిని కొంతవరకు తగ్గించాలని చిరంజీవి తన మూవీలో పవన్ బాడీ ల్యాంగ్వేజ్ అనుసరిస్తున్నాడు అన్న మాటలు వినిపిస్తున్నాయి. ఈనెలలో పవన్ కళ్యాణ్ ‘బ్రో’ వచ్చేనెలలో చిరంజీవి ‘భోళా శంకర్’ విడుదల అవుతున్న పరిస్థితులలో ఈ రెండు సినిమాల హడావిడితో బాక్స్ ఆఫీసు హోరెత్తబోతోంది..    


మరింత సమాచారం తెలుసుకోండి: