వీళ్ళ విజయాలను కాస్త పక్కన పెడితే...జగపతి బాబు వదులుకున్న ఒక అద్భుతమైన కథను శ్రీకాంత్ పట్టేసాడు. ఆ విజయంతో ఒక మెట్టు ఎక్కేసాడు కూడా. జగపతి బాబు ఆ సినిమా వదులుకోకపోయి ఉంటె ఆయన కెరీర్ మరింత అద్భుతంగా సాగేదని అభిప్రాయపడుతున్నారు సినీ విశ్లేషకులు. ఆ కథ ఏమిటి అనుకుంటున్నారా? అదే ఎస్ వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన "ఆహ్వానం". ఈ సినిమా శ్రీకాంత్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్. కానీ ఈ కథను మొదట కృష్ణారెడ్డి గారు జగపతి బాబుకు వినిపించారట. ఆయనకు ఈ కథ నచ్చింది కూడా. కానీ డేట్స్ కుదరక చేయలేకపోయారు. జగపతి బాబు కోసం వెయిట్ చెయ్యలేక ఈ కథను శ్రీకాంత్ తో తీసారట కృష్ణారెడ్డి.
ఇలా జగపతి బాబు వదులుకున్న సినిమా శ్రీకాంత్ పాలిట వరమైంది. ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించింది. ఈ సినిమా పాటలు కూడా అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ కాంబో మిస్ అయినా తరువాత మళ్ళి కృష్ణారెడ్డి, జగపతిబాబు కలిసి చాలా సినిమాలు చేసారు. మావిచిగురు, శుభలగ్నం వంటి చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. ప్రస్తుతం జగపతిబాబు తన సినీ కెరీర్ లో మంచి ఫామ్ లో ఉన్నాడు. లెజెండ్ తో విల్లన్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన జగపతి బాబు వరుస అవకాశాలతో చాలా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన సథరన్ ఫిలిం ఇండస్ట్రీస్ లో మోస్ట్ వాంటెడ్ విల్లన్. జగపతిబాబుకు ఎంతగానో కలిసొచ్చిన కృష్ణారెడ్డి గారు మాత్రం ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి