ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ స్టూడియోలో ఆమె సందడి చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. చాల ఉత్సాహంగా కనిపిస్తున్న సమంతను చూసిన వారు ఆమెకు ఇంకా అనారోగ్యం వెంటాడుతుంది అంటే నమ్మలేని స్థితిలో ఉన్నారు. ఈ ఫోటోలను చూసిన కొంతమంది సమంత కావాలనే ‘ఖుషీ’ ప్రమోషన్ ను ఎగ్గొట్టిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరికొందరైతే ఆమె హాలీవుడ్ అవకాశాలను అన్వేషిస్తూ వార్నర్ స్టూడియోలో సందడి చేస్తుందా అంటూ ఊహాగానాలు చేస్తున్నారు. నాగచైతన్య తో ఆమె బంధం విడిపోయిన తరువాత ఆమెకు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి అవకాశాలు పెద్దగా రావడం లేదు అన్నప్రచారం కూడ జరుగుతోంది. దీనితో ఆమె దృష్టి బాలీవుడ్ వెబ్ సిరీస్ లపై అదేవిధంగా అవకాశం కలిసి వస్తే హాలీవుడ్ వెబ్ సిరీస్ లపై ఆమె దృష్టి పెట్టిందా అన్న సందేహాలు కూడ కొందరికి కలుగుతున్నాయి.
బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా గతంలో ఇలాగే బాలీవుడ్ లో ఆమెకు అవకాశాలు తగ్గినప్పుడు ఆమె హాలీవుడ్ బాట పట్టి ప్రస్తుతం ఆమె అనేక హాలీవుడ్ వెబ్ సిరీస్ లలో నటిస్తోంది. ఇప్పుడు సమంత కూడ ఆమెను ఆదర్శంగా తీసుకుని ఇలాంటి ప్రయత్నాలు చేస్తోందా అని అనిపించడం సహజం. అయితే హాలీవుడ్ లో అవకాశాలు రావడం అంత సులువైన పని కాదు. దీనితో సమంత పట్టుదలతో ఆ ప్రయత్నాలలో ఎంతవరకు రాణిస్తుందో చూడాలి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి