దీనితో చాల మీడియం రేంజ్ చిన్న సినిమాలకు గౌరవ ప్రమోటర్ గా చిరంజీవి మారిపోతున్నాడు. ఇలాంటి పరిస్థితులలో చిరంజీవి ఈవారం విడుదల కాబోతున్న ‘మిస్ శెట్టి మిష్టర్ పోలిశెట్టి’ సినిమాను విడుదల కాకముందే చూడటం ఆసినిమా చాల బాగుంది అంటూ ప్రశంసలు కురిపించడంతో ఈ మూవీ ఓపెనింగ్స్ కు కొంతవరకు చిరంజీవి ప్రశంసలు సహకరిస్తాయ అన్న సందేహాలు వస్తున్నాయి.
వాస్తవానికి ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లో ఎక్కడా అనుష్క జాడలేదు. ఈ సినిమా ప్రమోషన్ మొత్తం హీరో నవీన్ పోలిశెట్టి తాను ఒక్కడే నిర్వహించాడు. కనీసం ఈసినిమాకు సంబంధించి మీడియా ఇంటర్వ్యూలలో కూడ అనుష్క కనిపించలేదు. ఈసినిమా ప్రమోషన్ విషయమై ఎందుకు అనుష్క ఇలా ప్రవర్తించిందో తెలియక చాలామంది షాక్ అవుతున్నారు.
దక్షిణాది లేడీ సూపర్ స్టార్ గా పేరు గాంచిన నయనతార తన సినిమాల ప్రమోషన్ ను ఏమాత్రం పట్టించుకోదు షారూఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’ మూవీలో నయనతార కీలక పాత్రలో నటిస్తున్నప్పటికీ ఆమె ఆసినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు డుమ్మా కొట్టింది. ఇప్పుడు అనుష్క కూడ నయనతార మార్గంలో పయనిస్తోందా అన్న సందేహాలు రావడం సర్వ సాధారణ విషయం. ఇది ఇలా ఉంటే ఈసినిమా రిజల్ట్ తెలియనప్పటికీ కొంతమంది దర్శక నిర్మాతలు అనుష్క ను కలిసి తమ సినిమాకు సంబంధించిన కథలు వినమని ఆమెను అడుగుతున్నప్పటికీ ఆమె కనీసం వారికి అపాయింట్మెంట్ ఇవ్వడంలేదు అన్న గుసగుసలు ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తున్నాయి. దీనితో అనుష్కకు ఎందుకు ఇంత నైరాశ్యం వచ్చింది అంటూ ఆమె అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడ ఆశ్చర్యపడుతున్నట్లు తెలుస్తోంది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి