గత కొంతకాలంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో రీ రిలీజ్ సీజన్ బాగా నడుస్తోంది. టాప్ హీరోల ఒకనాటి బ్లాక్ బష్టర్ సినిమాలు మళ్ళీ రీ రిలీజ్ చేస్తున్నారు. టాప్ హీరోల అభిమానులు ఈ రీ రిలీజ్ సినిమాలను కూడ విపరీతంగా చూస్తూ ఉండటమే కాకుండా ఆసినిమాలు ప్రదర్శించే ధియేటర్లలో టాప్ హీరోల అభిమానులు చేస్తున్న హంగామా చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది.



ఈమ్యానియాను క్యాష్ చేసుకోవాలని ఒకనాటి సూపర్ హిట్ అయిన చిన్న సినిమాలు కూడ ప్రయత్నిస్తున్నాయి. అలాంటి సినిమాల లిస్టులో ఒకనాటి ‘7జి బృందావన్ కాలనీ’ కూడ ఉంది. ఈసినిమాను సెప్టెంబర్ 22న విడుదల చేయబోతున్నారు. వాస్తవానికి ఈసినిమా రీ రిలీజ్ గురించి మొదట్లో ఎవరు పట్టించుకోలేదు. అయితే ఎప్పుడైతే సెప్టెంబర్ 28న రావలసిన ‘సలార్’ వాయిదా పడటంతో సెప్టెంబర్ మూడవ వారం ఖాళీగా మారింది.



ఇప్పటికిప్పుడు మీడియం రేంజ్ లేదా చిన్న సినిమాలు కూడ హడావిడిగా విడుదల చేయడం జరగని పని. దీనితో పూర్తిగా ఖాళీగా మారిపోయిన సెప్టెంబర్ మూడవ వారం అంతా ‘7జి బృందావన్ కాలనీ’ కి కలిసి వచ్చే ఆస్కారం కనిపిస్తోంది. ఆసమయానికి షారూఖ్ ఖాన్ ‘జవాన్’ ఆనుష్క నవీన్ పోలిశెట్టి ల ‘మిస్ పోలిశెట్టి మిష్టర్ పోలిశెట్టి’ ల హడావిడి కూడ పూర్తిగా తగ్గిపోతుంది.



వాస్తవానికి ‘వినాయకచవితిని’ టార్గెట్ చేస్తూ లారెన్స్ ‘చంద్రముఖి 2’ విడుదల అవుతున్నప్పటికీ ఆమూవీ పై పెద్దగా అంచనాలు లేవు. దీనితో జరుగుతున్న పరిణామాలు అన్నీ రీ రిలీజ్ కు రెడీ అవుతున్న ‘7జీ బృందావన్’ కు అనుకూలంగా ఉన్నాయి అంటూ కొందరు అంచనాలు వేస్తున్న నేపధ్యంలో ఈ రీ రిలీజ్ సినిమా రైట్స్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు టాక్. అంచనాలకు అనుగుణంగా ఈసినిమా రీ రిలీజ్ లో కూడ సక్సస్ అయితే అలనాటి సక్సస్ అయిన చాల మీడియం చిన్న సినిమాలు తిరిగి రీ రిలీజ్ కు సిద్ధం అయ్యే ఆస్కారం ఉంది..  



మరింత సమాచారం తెలుసుకోండి: