తెలుగు బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాల్టీ షో గా పేరు సంపాదించుకున్న బిగ్ బాస్ కార్యక్రమం ఎంతో విజయవంతంగా 6 సీజన్లు పూర్తి చేసుకుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఎవడో సీజన్ ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ పంచుతుంది. ఇటీవల  ప్రారంభమైన బిగ్బాస్ ఏడవ సీజన్ ఎప్పటిలాగానే టాప్ రేటింగ్స్ అంతం చేసుకుంటూ దూసుకుపోతుంది అని చెప్పాలి  అయితే 14 మంది కంటెస్టెంట్స్ ని అటు హౌస్ లోకి పంపించారు. అయితే ఇక ఇలా హౌస్ లోకి పంపించిన కంటెస్టెంట్స్ లో ఏడవ కంటెస్టెంట్ గా హౌస్ లోపలికి ఎంట్రీ ఇచ్చాడు శివాజీ   అయితే ఈయన గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు.


 హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కమెడియన్ గా రాజకీయ నాయకుడిగా శివాజీ అందరికీ సుపరిచితుడే అని చెప్పాలి. అయితే హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఇక శివాజీ గురించి ఎవరికీ తెలియని విషయాలను కూడా తెలుసుకోవడానికి నేటిజన్స్ తెగ ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన గురించి సోషల్ మీడియాలో తెగ వెతికేస్తున్నారు అని చెప్పాలి. కాగా గుంటూరు జిల్లాలో జన్మించిన శివాజీ డిగ్రీ పూర్తి చేశాడు. నటుడు అవ్వాలని ఆయన ఎప్పుడూ అనుకోలేదు. ఏదైనా ఉద్యోగం చేసి డబ్బులు సంపాదిద్దామని హైదరాబాద్ వచ్చారు  ఆ సమయంలోనే కొత్తగా ప్రారంభమైన జెమినీ టీవీలో వీడియో ఎడిటర్ గా ఆయన పనికి చేరారు.


 తర్వాత కొన్నాళ్లకి జెమినీ టీవీలో యాంకర్ గా అవతారం ఎత్తాడు. కొన్నాళ్లకు  ఫిల్మ్ ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చాయి. దీంతో ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేశాడు. హీరోగాను నిలదొక్కుకొని ప్రేక్షకులను అలరించాడు. 2016 లో వచ్చిన సీసా మూవీ తర్వాత శివాజీ వెండితెరకు దూరమై రాజకీయాల వైపు అడుగులు వేశారు. అయితే హీరో శివాజీకి యంగ్ హీరో నితిన్ కి మధ్య సంబంధం ఉంది అన్న వార్త వైరల్ గా మారిపోయింది  అయితే వీరి మధ్య ఎలాంటి బంధుత్వం లేదు. కానీ మంచి సాన్నిహిత్య బంధం ఉంది. నితిన్ డెబ్యూ మూవీ జయం గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో నితిన్ కు డబ్బింగ్ చెప్పింది మరి ఎవరో కాదు శివాజీనే. ఇక దిల్ సినిమాలో కూడా నితిన్ కు శివాజీ నే డబ్బింగ్ చెప్పాడు. దిల్ సినిమాకు గాను డబ్బింగ్ ఆర్టిస్ట్ గా శివాజీ నంది అవార్డు అందుకున్నాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: