ఇక లేటెస్ట్ గా విడుదలైన రజనీకాంత్ ‘జైలర్’ షారూఖ్ ఖాన్ ‘జవాన్’ మూవీలు కూడ తెలుగు ప్రేక్షకులకు విపరీతంగా నచ్చడంతో ఆరెండు సినిమాల డబ్బింగ్ వెర్షన్స్ కు కోట్లు కురుస్తున్నాయి. వాస్తవానికి తెలుగు ప్రేక్షకులు డబ్బింగ్ సినిమాలను ఆదరించడం ఎప్పటినుంచో కొనసాగుతున్న ప్రక్రియ. మణిరత్నం భారతీయరాజ భాగ్యరాజ లు తీసిన ఎన్నోసినిమాలను ఆదరించిన ఘనత గతంలో తెలుగు ప్రేక్షకులకు ఉంది. అంతేకాదు గతంలో వచ్చిన ‘భారతీయుడు’ ‘బాయస్’ ‘రోబో’ ‘అపరచితుడు’ సినిమాలు డబ్బింగ్ సినిమాలు అయినప్పటికీ వాటిని తెలుగు సినిమాలుగా భావించి ఆరోజులలోనే తెలుగు ప్రేక్షకులు రికార్డుల కలక్షన్స్ ను కురిపించిన విషయం తెలిసిందే.
అయితే తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీని దశాబ్ధాల పాటు శాసించిన బాపు రాఘవేంద్రరావు దాసరి నారాయణరావు విశ్వనాథ్ ల సినిమాలను తెలుగు ప్రేక్షకులు తప్ప మిగతా రాష్ట్రాల ప్రేక్షకులు పెద్దగా ఆదరించిన సందర్భాలు గతంలో పెద్దగా కనిపించవు. ప్రస్తుతకాలంలో ఒక్క రాజమౌళి సినిమాలను మాత్రమే మన పక్క రాష్ట్రాలలోని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అయితే మన తెలుగు ప్రేక్షకులు మాత్రం భాషా భేదం లేకుండా తమకు నచ్చితే చాలు ఏభాషకు సంబంధించిన డబ్బింగ్ సినిమాకు అయినా కోట్లు కురిపిస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల మధ్య రాబోతున్న ‘దసరా’ కు బాలకృష్ణ ‘భగవత్ కేసరి’ మూవీతో తమిళ హీరో విజయ్ నటించిన ‘లియో’ తెలుగు డబ్బింగ్ విడుదల అవుతోంది అంటే తెలుగు ప్రేక్షకులు డబ్బింగ్ సినిమాలను ఏవిధంగా ఆదరిస్తున్నారో అర్థం అవుతుంది. ఈసినిమా డబ్బింగ్ రైట్స్ ను 21కోట్లకు కొన్నారు అన్నవార్తలు డబ్బింగ్ సినిమాల మ్యానియాను సూచిస్తోంది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి