అయినప్పటికీ నిరాశ చెందకుండా రవితేజా మరో చిన్న సినిమాను నిర్మించి ప్రమోట్ చేస్తున్నాడు. ‘ఛాంగురే బంగారురాజా’ టైటిల్ తో విడుదల కాబోతున్న ఈమూవీ ఈవారం విడుదల కాబోతోంది. కామెడీ థ్రిల్లర్ గా రూపొందిన ఈమూవీలో ‘కేరాఫ్ కంచెరపాలం’ ఫేమ్ కార్తీక్ రత్నంతో పాటు కమెడియన్ సత్య కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఈమూవీ ట్రైలర్ కు మంచి స్పందన రావడంతో ఈమూవీ పై మాస్ మహారాజ చాల ఆశలు పెట్టుకున్నాడు. ఈవారాంతం తరువాత వినాయకచవితి వస్తూ ఉండటంతో ఈ పండుగ సీజన్ తన చిన్న సినిమాకు బాగా కలిసి వస్తుందని రవితేజా ఆశ పడుతున్నాడు. ఈవారాంతంలో సినిమా అభిమానులకు చూడటానికి మంచి సినిమా ఏది లేకపోవడం ఆసమయానికి షారూఖ్ ఖాన్ ‘జవాన్’ నవీన్ పోలిశెట్టి ‘మిస్ శెట్టి మిష్టర్ పోలిశెట్టి’ సినిమాల హవా కొంతవరకు తగ్గుతుంది కాబట్టి తన చిన్న సినిమాను చూడటానికి ప్రేక్షకులు బాగా వస్తారని రవితేజా భారీ అంచనాలతో ఉన్నాడు.
అయితే చిన్న సినిమాలకు టోటల్ పాజిటివ్ టాక్ వచ్చినప్పుడు మాత్రమే ప్రేక్షకులు ధియేటర్లకు వస్తున్నారు. చిన్న సినిమాల విషయంలో ఏమాత్రం డివైడ్ టాక్ వచ్చినా ఆసినిమాను ఒ టీటీ లో చూడవచ్చు అని సరిపెట్టుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో రవితేజా ప్రయత్నానికి మరొక సారి ప్రేక్షకుల నుండి సరైన స్పందన రాకుంటే భవిష్యత్ లో మరిన్ని చిన్న సినిమాలు తీసే విషయంలో మాస్ మహారాజ ఆలోచనల్లో మార్పు వచ్చే ఆస్కారం ఉంది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి