మళయాళంలో సూపర్ హిట్ అయిన ‘బ్రో డాడీ’ మూవీకి రచయిత బెజవాడ ప్రసన్న కుమార్ చేసిన మార్పులు చేర్పులు చిరంజీవికి నచ్చడంతో ఈమూవీ షూటింగ్ ప్రారంభించడమే తరువాయి అని అనుకున్నారు అంతా. అయితే లేటెస్ట్ గా చిరంజీవి నటించిన ‘భోళాశంకర్’ ఘోర పరాజయం చెందడంతో మళ్ళీ రీమేక్ ల జోలికి వెళ్ళడం మంచిది కాదు అన్న ఉద్దేశ్యం చిరంజీవికి ఏర్పడటంతో ఈమూవీ హోల్డ్ లో పడింది అంటూ వార్తలు వస్తున్నాయి.
ఈసినిమాను పక్కకు పెట్టి చిరంజీవి మైత్రి మూవీస్ దర్శకుడు వశిష్ట మల్లిడి చెప్పిన పంచభూతాల లైన్ నచ్చదయంతో ఇప్పుడు ఆమూవీకి ఓకె చెప్పడంతో ఆమూవీకి సంబంధించిన స్క్రిప్ట్ పనులు చాల వేగంగా జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మూవీలో చిరంజీవి పక్కన ‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ నటిస్తూ ఉండటం మరింత సంచలనంగా మారింది.
తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీ షూటింగ్ నవంబర్ లో ప్రారంభం అవుతుంది అంటున్నారు. ఈమూవీ షూటింగ్ ను వేగంగా పూర్తి చేసి వచ్చే సంవత్సరం సమ్మర్ రేస్ చివరిలో విడుదల చేయాలి అన్న ఆలోచనలలో ఈమూవీ నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈమూవీ తరువాత అయినా చిరంజీవి కళ్యాణ్ కృష్ణ మూవీ షూటింగ్ ను మొదలుపెడతాడా లేదంటే శాశ్వితంగా ఆటకెక్కిందా అన్న సందేహాలు ఇండస్ట్రీలో చాలామందికి వస్తున్నాయి. ఇప్పుడు ఈవిషయాలు అన్నీ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దృష్టివరకు రావడంతో అతడు కన్ఫ్యూజన్ లో ఉన్నాడు అంటూ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి