నిత్యామీనన్.. ఈ పేరుకు స్పెషల్‌గా పరిచయం అవసరం లేదు. ఈ బెంగళూరు పిల్ల "అలా మొదలైంది", "ఇష్క్", "జబర్దస్త్", "సన్నాఫ్ సత్యమూర్తి", "భీమ్లా నాయక్" వంటి సినిమాల్లో నటించి బాగా అలరించింది. వెబ్ సిరీస్ లలో కూడా యాక్ట్ చేస్తూ ఆకట్టుకుంటోంది. ఈ ముద్దుగుమ్మ ఇటీవల నటించిన "కుమారి శ్రీమతి" వెబ్ సిరీస్ కొద్ది రోజుల క్రితం ఓటీటీలో విడుదలయ్యింది. దీనిని ప్రమోట్ చేసేందుకు నిత్య కొన్ని ఇంటర్వ్యూలు ఇస్తూ ఆసక్తికర అంశాలపై మాట్లాడుతోంది. తాజాగా రోల్స్ సెలక్షన్, అలాగే మూవీ లాంగ్వేజెస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ కేవలం తన పాత్రకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చే సినిమాలు ఎంచుకునే మైండ్ సెట్ తనకు లేదని తెలిపింది. ఒక సినిమా కథ బాగుంటే అందులో తాను భాగం కావడానికి ఆసక్తి చూపుతానని స్పష్టం చేసింది. తాను నటించే సినిమాలో కథ తనకు చాలా ముఖ్యమని, అది బాగుంటే చేయడానికి వెంటనే ఒప్పేసుకుంటానని తెలిపింది. ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలు వస్తే... అది తన అదృష్టమని, వాటిని వెంటనే యాక్సెప్ట్ చేస్తానని వివరించింది.

"కొందరు ఫలానా భాషలో ఎక్కువగా నటించొచ్చు కదా అని అడుగుతుంటారు, కానీ నేను నటించేటప్పుడు భాషను చూడను, స్క్రిప్ట్ మాత్రమే చదువుతాను. నచ్చితే ఏ భాషలోనైనా సినిమా చేయడానికి ఇష్టపడతాను. భాషాపరమైన పరిమితులు ఏవీ పెట్టుకోలేదు." నిత్యా మీనన్ తెలిపింది.

తెలుగు, తమిళం, కన్నడ ఇలా పలు భాషల్లో తాను అనర్గళంగా మాట్లాడగలనని, ఒకే భాషలో చేయాలన్నా ఆలోచన తనకు ఎన్నడూ రాలేదని నిత్యా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ తార శ్రీమతి కుమారి తెలుగు వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సిరీస్ పెళ్లి చుట్టూ తిరుగుతుంటుంది. ఇందులో నిత్యా పర్ఫామెన్స్ అదిరిపోయిందని క్రిటిక్స్ తో పాటు విమర్శకులు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నిత్యా గతంలో మోడర్న్ లవ్ హైదరాబాద్ తెలుగు వెబ్ సిరీస్ ద్వారా కూడా ఎంటర్‌టైన్‌ చేసింది.

నిత్యా కేవలం భారతీయ భాషల్లోనే కాకుండా ఇంగ్లీష్ సినిమాల్లో కూడా నటిస్తోంది. మొత్తం మీద ఈ ముద్దుగుమ్మ తన నటన ప్రతిభతో చాలామంది ప్రేక్షకులకు ఫేవరెట్ నటిగా మారిపోతుంది. ఎలాంటి గ్లామర్ పండించకుండానే సాయి పల్లవి లాగా కోట్ల మంది అభిమానాన్ని చూరగొంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: