లేటెస్ట్ గా ఆమె స్టైలిష్ లుక్ లో జీన్స్ ప్యాంట్ వేసుకుని దానిపై బ్లాక్ కలర్ షర్ట్ బ్లాక్ కలర్ జాకెట్ వేసుకుని ఆ డ్రెస్ కు సూట్ అయ్యే విధంగా బ్లాక్ కలర్ కూలింగ్ గ్లాస్ ను పెట్టుకున్న ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటోలను యాష్ కలర్ బ్యాక్ గ్రౌండ్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ‘'ఎవ్రీబడీస్ డార్లింగ్' డార్లింగ్ అంటూ వ్రాసి ఉన్న ఆఫోటోలో Or not.. I can live with both అంటూ ఒక క్యాప్క్షన్ కూడ కనిపిస్తోంది.
దీనితో జీవితంలో జరిగిన సంఘటనల గురించి సమంత ఎటువంటి బెంగ పడకుండా తాను పరిస్థితులతో పోరాటం చేయగలను అన్న విషయాన్ని ఆమె అందరికీ తెలియచేసే విధంగా ఆమె షేర్ చేసిన ఫోటో వెనుక క్యాప్ క్షన్ ఉంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా సమంత కు సరైన ఆఫర్స్ రాకపోవడంతో తనకు తనకు తానుగా తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీకి దూరం అయిందా లేదంటే ఆమె కోరుకుని తనకు తానుగా ఒక సంవత్సర కాలం ఫిలిమ్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటోందా అంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
అయితే సోషల్ మీడియాలో తనపై కొందరు నెగిటివ్ ప్రచారం చేస్తున్నప్పటికీ ఆ విషయాలను పట్టించుకోకుండా సమంత తాను చాల ఆనందంగా ఉన్నాను అని తెలియచేసే విధంగా ఆమె ఫోటోలు కనిపిస్తున్నాయి అంటూ మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి